షాకింగ్ న్యూస్ : 827 మంది జర్నలిస్టుల ఖతం

Shocking news Journalist killed every 4.5 days

05:14 PM ON 3rd November, 2016 By Mirchi Vilas

Shocking news Journalist killed every 4.5 days

ఏదైనా విషయం మీద మీడియాలో కధనాలు రాస్తే సదరు జర్నలిస్టులకు ఎలాంటి బెదిరింపులు వుంటాయోఅందరికీ తెల్సిందే. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసేస్తుంటారు. అయితే అక్కడ మాత్రం ఏకంగా 827 మంది జర్నలిస్టులను లేపేసారట. ప్రతి నాలుగున్నర రోజులకో జర్నలిస్ట్ ను చంపేస్తున్నారని యునెస్కో తెలిపింది. గడచిన దశాబ్దంలో 827 మంది జర్నలిస్టులను చంపేశారంటూ షాకింగ్ నివేదికను బయటపెట్టింది. సిరియా, ఇరాక్, యెమెన్, లిబియా, లాటిన్ అమెరికాల్లో ఈ హత్యలు జరిగాయి. జర్నలిస్టులు విధులు నిర్వహించడం ప్రమాదకరంగా మారిందని యునెస్కో నివేదిక వెల్లడించింది. గడచిన రెండేళ్లలో 59 శాతం హత్యలు జరిగాయి. ఎక్కువ మంది జర్నలిస్టులు అరబ్ దేశాల్లోనే ఎక్కువగా హత్యకు గురయ్యారు. పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికాలో కూడా జర్నలిస్టుల హత్యలు జరుగుతున్నాయి. విదేశీ జర్నలిస్టుల కన్నా లోకల్ జర్నలిస్టులకే ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదికలో ఉంది. మహిళా జర్నలిస్టులు కూడా బలైపోతున్నారు. జర్నలిస్టులను అపహరించడం, హింసించి చంపడం వంటి ఘటనలు పెరిగాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది కూడా చూడండి: భారత్ లో ఏటా కోటి సంపాదించేవాళ్ళు ఎందరో తెలుసా?

ఇది కూడా చూడండి: ప్రెగ్నన్సీ టైంలో ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి..

English summary

Shocking news Journalist killed every 4.5 days.