డామిట్ మైఖేల్ జాక్సన్ బతికే వున్నాడా! సెల్ఫీతో షాకింగ్ న్యూస్

Shocking News Michael Jackson Still Alive

11:24 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Shocking News Michael Jackson Still Alive

ఇది నిజామా కాదా అనే విషయంలోకి వెళ్లేముందు, ఒకసారి గతంలోకి వెళ్తే, పాప్ వరల్డ్ రారాజు మైకేల్ జాక్సన్ మరణ వార్త 2009లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆయన అభిమానుల వాదనలు మరోసారి సంచలనంగా మారాయి. ఈ సంచలన వాదనకు కారణం జాక్సన్ కూతురు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోనే కారణం.

కూతురు పోస్ట్ చేసిన సెల్ఫీలో జాక్సన్ ఉన్నారని, జాక్సన్ మరణించలేదనే తమ వాదనకు బలం చేకూరిందని అభిమానులు గట్టిగా వాదిస్తున్నారు. జాక్సన్ కూతురు ‘పారీస్’ మే నెలలో చేసిన ఇన్ స్టాగ్రాం పోస్ట్ ఈ సంచలన వాదనకు కేంద్రబిందువైంది. సెల్ఫీలో వెనుక సీట్లో కూర్చుంది మైకేల్ జాక్సనేనని, ఆన్ లైన్ ఉన్న వీడియోనే తమ వాదనకు సాక్ష్యమని అభిమానులు వాదిస్తున్నారు. కూతురు పారీస్ మాత్రం వెనుకాల ఉన్నది మైకెల్ కాదని తన నీడని వాదిస్తోంది.

ఇది కూడా చూడండి: బిడ్డను కన్నాడు.. పాలిస్తున్నాడు..

మే 4న పోస్ట్ చేసిన వీడియో ‘ఒకవేళ నువ్వు కొంచెం ప్రేమను పంచితే నీలోని ప్రేమను నువ్వు కొంచెం పొందుతావు’ అనే టైటిల్ ఉంది. దీనిపై అనేక కామెంట్స్ వచ్చాయి. కామెంట్స్ చేసిన వారిలో చాలామంది కారులో మైకేల్ జాక్సనే వున్నాడని వాదించారు. ఒక వ్యక్తైతే ‘ఓ మై గాడ్ మైకేల్ ఇన్ ద బ్యాక్’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై నడుస్తున్న వాదనలు మైకేల్ ను కెనడా లేదా ఆఫ్రికాలో దాచారని అభిమానులు వాదిస్తున్నారు. కాగా మైకేల్ 2009లో తన వ్యక్తిగత డాక్టర్. కొనార్డ్ ముర్రే సూచించిన మందులు మోతాదుకు మించి వాడడం వల్లే మరణించాడని ప్రపంచానికి తెల్సిందే. అయినా ఎలాంటి వార్తలు రావడం విచిత్రం గానే ఉందని పలువురు నెటిజన్లు అంటున్నారు.

if you give a little love, you can get a little love of your own.

A photo posted by Paris-Michael K. Jackson (@parisjackson) on

English summary

Shocking News Michael Jackson Still Alive. Jackson claimed to be alive after fans see him in Michael Jackson daughter selfie.