బతికుండగానే తల్లిని శ్మశానంలో వధిలేసిన కర్కోటకుడు

Shocking News Son leaves mother in burial ground

11:42 AM ON 5th August, 2016 By Mirchi Vilas

Shocking News Son leaves mother in burial ground

కనిపెంచిన తల్లి దండ్రులను ఆదరించే సంస్కారం రోజురోజుకు తగ్గిపోతోంది. వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవాల్సిన కొడుకులే దారుణంగా ప్రవర్తిస్తూ, మానవ బంధాలనే సవాల్ చేస్తున్నారు. పేగు బంధాన్ని వెక్కిరిస్తూ కర్కోటకుడైన ఓ కొడుకు తల్లి పట్ల వ్యవహరించిన హేయమైన చర్య ఇది. వృద్ధాప్యంలో వున్న తల్లిని ఆదరించలేకపోవడమే కాకుండా శ్మశానవాటికలో వదిలి వెళ్లిన ఓ కొడుకు చేష్టలివి. 72ఏళ్ల వరకు ఎవరిపైనా ఆధారపడకుండా ఓ పూరిపాకలో జీవనం సాగించి, ఇక బతకడం కష్టం కావడంతో కొడుకును ఆశ్రయించింది. అక్కున చేర్చుకున్న 24 గంటలు తిరక్కుండానే అమ్మను శ్మశానవాటికలో వదిలేసి తనదారి తను చూసుకున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలోని మున్సిపల్ కాలనీని ఆనుకుని ఉన్న శ్మశానవాటికలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆమె పేరు సత్యవతి. ఆమెకు ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు. అయితే ఆ స్థల యజమానులు విధిలేని పరిస్థితిలో ఇళ్లు ఖాళీ చేయమని సూచించారు. దాంతో ఆమె రాజమహేంద్రవరంలో నివాసముంటున్న కొడుకు హనుమంతరావుకు ఫోనులో విషయం తెలియజేసింది. అక్కడి నుంచి వచ్చిన కుమారుడు తల్లిని తీసుకుని బుధవారం రాజమహేంద్రవరం వెళ్లాడు. అయితే కుటుంబ సభ్యులు ఆమెని ఇంట్లోకి అనుమతించేది లేదని, తెగేసి చెప్పడంతో విధిలేని పరిస్థితిలో కుమారుడు తిరిగి అమలాపురం చేరుకున్నాడు.

వృద్ధాశ్రమాల కోసం వెతికాడు. అవి లేకపోవడంతో రాత్రి 9 గంటల వరకు ఆమెను పట్టణ పరిసరాల్లో ఆటోలో తిప్పి చివరకు శ్మశానవాటికలో వదిలేసి వెళ్లిపోయాడు. స్థానికులు గుర్తించి ఆమెను రాత్రికి ఆదరించారు. గురువారం ఉదయమే పట్టణ సీఐ వైఆర్ కే శ్రీనివాస్ కు పిర్యాదు చేసారు. సీఐ అక్కడికి వెళ్లి సత్యవతి పరిస్థితిని అడిగి తెలుసుకుని కొత్త దుస్తులు ఇచ్చి ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కరక్కాయపేటలోని వృద్ధాశ్రమంలో ఆమెకు తాత్కాలిక వసతి కల్పించారు. కన్నతల్లనే మమకారం కూడా చూడకుండా బతికుండగానే శ్మశానవాటికలో వదిలివెళ్లిన కొడుకు హనుమంతరావుపై సెక్షన్ -24 ఆఫ్ ది మెయింట్ నెన్స్ , తల్లిదండ్రుల సంరక్షణ చట్టం-2007 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

English summary

Shocking News Son leaves mother in burial ground.