చనిపోయిన ఆ కుర్రాడు సెల్ నుంచి మెసేజ్ ... పోలీసులకు దిమ్మ తిరిగింది

Shocking News Text Message From Dead Niall Mobile Phone

10:53 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

Shocking News Text Message From Dead Niall Mobile Phone

ఎవరైనా చనిపోతే, అతనికి సంబంధించిన జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం అందరూ చేసే పని. కానీ ఓ కుర్రాడు చనిపోయిన తర్వాత మెసేజ్ ఇచ్చాడు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, యుకేలో ఓ ‘మర్డర్-సూసైడ్ ’ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంచలనం రేకెత్తించే ఘటన ఎదురైంది. తల్లి, ఇద్దరు సోదరులతో సహా తన తండ్రి చేతిలోనే హతమైన యువకుని సెల్ ఫోన్ నుంచి టెక్స్ట్ మెసేజ్ పంపించినట్లు వుంది. బాలుడు చనిపోయిన తర్వాత ఈ మెసేజ్ పంపించడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పోలీసులను, స్థానిక ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు అలెన్ హాన్ స్థానిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి ఒత్తిడికి గురవుతున్నాడని ఈ క్రమంలో భార్య క్లాడా, ముగ్గురు కుమారులు లియామ్(13), నియాల్(11), రయాన్ లను సోమవారం తన ఇంట్లో గోడ్డలితో నరికి చంపాడు. అనంతరం తాను ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. ప్రయత్నం విఫలమవ్వడంతో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈఘటన చాలా దారుణమని, తండ్రి చాలా మంచివారని స్థానికులంతా చెబుతున్నారు.

ఈ కేసును విచారణ చేస్తున్న పోలీసులు యువకుని సెల్ ఫోన్ సహా ఇంటిని సీజ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. ఆధారాల కోసం రెండవ బాలుడు నియాల్ సెల్ లోని డేటాను పరిశీలించగా అందులోని చివరి మెసేజ్ ‘చెడు నుంచి మంచి వస్తుంది’( ఫ్రంమ్ ఇవిల్ కమ్స్ గుడ్) అని ఉంది. అయితే ఈ మెసేజ్ బాలుడు చనిపోయిన అనంతరం పంపించి ఉండడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది.

మీడియా ప్రతినిధులు మాత్రం విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. నిందితుడు నుంచి మరిన్ని ఆధారాలు రాబట్టడం కోసం పోలీసులు చేసిన ప్రయత్నంగా పేర్కోంటున్నారు. పోలీసులు చేసిన ప్రయత్నమైతే బానే ఉంటుంది కానీ చనిపోయిన వ్యక్తి సెల్ ఫోన్ నుంచి మెసేజ్ ఎలా వచ్చిందని అందరూ ఆశ్యర్యంతో తలలు పట్టుకుంటున్నారు. దెయ్యంగా మారాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చూడండి: సన్నీలియోన్ గురించి మీకు తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: భారత్ లో అంతుచిక్కని రహస్యాలు

ఇది కూడా చూడండి: ఈ సంకేతాలుంటే అదృష్టం, ధనం మిమ్మల్ని వరిస్తాయట!

English summary

Teenager murdered by dad. Shocking News Text Message From Dead Teenager Niall Mobile Phone. The text message was From evil comes good.