జియో వినియోగదారులకు షాకింగ్ ఆఫర్!

Shocking offer for Jio users

04:32 PM ON 25th October, 2016 By Mirchi Vilas

Shocking offer for Jio users

ఇప్పటికే మూడు నెలలు ఫ్రీ ఆఫర్ ఇచ్చిన రిలయన్స్ జియో ఇప్పుడు వినియోగదారులకు మరో బ్లాస్టింగ్ ఆఫర్ ను ప్రకటించేందుకు రిలయన్స్ సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే ఉచిత ఆఫర్ తో పోటీ టెలికం కంపెనీల గుండెల్లో గుబులు పుట్టించిన జియో.. వాటిని మరింత దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబరు 3తో ముగియనున్న ఉచిత వాయిస్ కాల్ ఆఫర్ ను మరో మూడు నెలల పాటు అంటే మార్చి 2017 వరకు పొడిగించేందుకు సిద్ధంగా ఉందట. ఈ కొత్త ఆఫర్ ద్వారా పదికోట్ల మంది వినియోగదారులను చేరుకోవాలని భావిస్తోంది. నిజానికి టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్(2004) ప్రకారం ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులకు మించి ఉండడానికి వీల్లేదు.

ఈ నిబంధన కారణంగా జియో మరో మూడు నెలల పాటు ఆఫర్ ను ఎలా పొడిగిస్తుందనే దానిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే డిసెంబరు తర్వాత ఉచిత సేవలు కొనసాగించేందుకు ట్రాయ్ అనుమతితో పనిలేదని జియో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ హెడ్ అన్షుమన్ ఠాకూర్ అంటున్నారు. లాంచింగ్ సమయంలో వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు సేవలను అందించలేకపోతే, వారి నుంచి చార్జీలు వసూలు చేయడం కూడా న్యాయవిరుద్ధమన్న కోణంలో ఉచిత సేవలను పొడిగించేందుకు జియో సిద్ధమవుతోంది. ఇంటర్ కనెక్షన్ సమస్యల వల్ల వినియోగదారులు నాణ్యమైన సేవలు అందుకోలేకపోతున్నారని జియో అధికారులు చెబుతున్నారు.

అందుకే ఉచిత ఆఫర్ పొడిగింపునకు ట్రాయ్ అనుమతి అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికే ఫ్రీగా నెట్, కాల్స్ వినియోగించుకుంటున్నవాళ్లకు ఈ ఆఫర్ వస్తే, మార్చి వరకూ వాడకం భీభత్సంగా వుంటుందనే మాటలు వినిపిస్తున్నాయి.

English summary

Shocking offer for Jio users