రాజమౌళి రెమ్యునరేషన్ చూస్తే గుండె గుభేల్...

Shocking remuneration for Rajamouli

10:41 AM ON 6th August, 2016 By Mirchi Vilas

Shocking remuneration for Rajamouli

అవును మరి అదేం చిత్రమో గానీ, ఇప్పటి వరకూ ఫ్లాప్స్ ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి... ఒకవేళ ఇతనికి సినిమా ప్లాప్ అనేది లేకుండా వరం ఏదైనా ఉందా అని చాలామందికి సందేహం. ప్లాప్ లు చూసే దర్శకులకైతే కన్ను కుట్టడం ఖాయం. ఇక జక్కన్న తీసుకొంటున్న రెమ్యునరేషన్ వింటే ఎవరికైనా గుండె గుభేల్ మంటుందనడంలో ఎలాంటి సందేహం లేనే లేదు. హిట్స్ లోనే కాదు.. రెమ్యునరేషన్ విషయంలో కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ లో రాజమౌళి అలా ఇలా లేడు. టాప్ మోస్ట్ నంబర్ వన్ గా వున్నాడు. తెలుగు సినిమా సత్తాని.. స్టామినా ఎలాంటిదో బాలీవుడ్ కి బాహుబలి ద్వారా రుచి చూపించాడు. ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లను వసూలు చేసిన బాహుబలి ని చూసి బాలీవుడ్ షేక్ అయ్యింది.

ఇక ఈ సినిమా కలెక్షన్లలాగే రాజమౌళి 30 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకొన్నాడు. బాహుబలికి వచ్చిన కలెక్షన్లతో ఇప్పుడు బాహుబలి 2 బిజినెస్ భారీగా జరుగుతోంది. ఇక ఈ సినిమాకి రాజమౌళి తీసుకొంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ లో హాట్ హాట్ గా మారింది. తెలుగులో కాకుండా హిందీ, తమిళ్ నుంచి వచ్చే బిజినెస్ అమౌంట్ లో సగం తన రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నాడట. అందుకు నిర్మాతలు కూడా అంగీకరించినట్టు టాక్ వినిపిస్తోంది. ఇతర భాషల్లో ఈ సినిమా 150 నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని, దాంతో 75- 100 కోట్ల మధ్య రాజమౌళి రెమ్యూనరేషన్ ఉండచ్చని టాక్. ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే మాటలు కాదు. అందరికీ ఆశ్చర్యం కల్గిస్తోంది.

English summary

Shocking remuneration for Rajamouli