జాగ్వార్ రెమ్యూనరేషన్లు తెలిస్తే షాకే!

Shocking remunerations for Jaguar movie

04:47 PM ON 20th September, 2016 By Mirchi Vilas

Shocking remunerations for Jaguar movie

మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ డెబ్యూ మూవీ జాగ్వార్ సినిమాకు జరుగుతున్న హడావిడికి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. జాగ్వార్ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి కళ్ళ ముందు కనిపిస్తోంది. నిర్మాతలు హీరో మార్కెట్ ను బట్టి ఖర్చు చేస్తారు. అయితే జాగ్వార్ హీరో ఇక్కడ ఓ మాజీ ప్రధానికి మనవడు, ఓ మాజీ ముఖమంత్రి తనయుడు. అందుకే డబ్బు వెదజల్లారు. ఈ సినిమాకి రూ. 70 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఆ లెక్కన ఇది సౌత్ ఇండియాలోనే ఖరీదైన డెబ్యూ సినిమాగా రికార్డులకు ఎక్కనుంది. ఈ సినిమాకు మిత్రుడు ఫేం మహదేవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెమ్యునరేషన్లు చూస్తే పెద్ద షాక్ గా ఉంది.

జగపతి బాబు పారితోషికం 50 లక్షలు అనుకుందాం.. అయితే ఈ సినిమాకి కోటిన్నర ఇచ్చారట. విజయేంద్ర ప్రసాద్ కు కథ కోసమే రూ. 75 లక్షలు ఇచ్చారట. ఇక హీరోయిన్ దీప్తి సాథికు కూడా రూ. 2 కోట్లు ఇచ్చారట. మరో ట్విస్ట్ ఏంటంటే హీరోకు రెమ్యునరేషన్ లేదు. ఇక ఇప్పుడు పబ్లిసిటీ పై పడ్డారు. అందుకోసం రూ. 7 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఆదివారం జరిగిన ఆడియో వేడుక భారీ ఎత్తున సాగింది. ఓ స్టార్ హీరో స్థాయిలో జరిగింది. ఇందుకోసం పొలిటికల్ మీటింగ్ లా జనాన్ని సమీకరించారట. రాయచూర్ నుంచి 1000 మందిని దింపారని తెలుస్తోంది. సరే ఈ హంగామాలు ఎలా ఉన్నా మరి సినిమాలో ఏ స్థాయిలో దమ్ముందో దసరాకు తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: శ్రీకాకుళంలో బ్లూఫిలిమ్స్ కలకలం..

ఇది కూడా చదవండి: ప్లాస్టిక్ బాటిల్స్ మీద ఉన్న నంబర్స్ కి అర్ధం తెలుసా?

ఇది కూడా చదవండి: మీరు ప్రేమించిన వాడు మోసగాడా? అయితే వదిలించుకోండిలా..

English summary

Shocking remunerations for Jaguar movie. Ex Prime minsiter Deva Gouda's grand son and Karnataka ex chief minster Kumar Swamy's son Nikhil Gouda debut movie is Jaguar. And hot beauty Deepthi Sati is acting as a heroine in this movie.