సెక్స్ ‌లైఫ్ పై  కరన్ జోహర్‌ షాకింగ్ కామెంట్స్ 

Shocking Things In Karan Johars Auto Biography

11:11 AM ON 10th January, 2017 By Mirchi Vilas

Shocking Things In Karan Johars Auto Biography

కొందరు నిత్యం వార్తల్లో వుంటారు. అందుకోసం ఏ మార్గాన్ని వదిలిపెట్టారు. కొందరు వార్తగా మారతారు. మరికొందరు అప్పుడప్పుడు సంచలనానికి వేదిక అవుతారు. అందులోనూ సెలబ్రిటీల్లో సినీతారల రూటే వేరు కదా. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరన్‌ జోహర్‌ తన ఆత్మకథలో సెక్స్‌ జీవితం గురించి ఎలాంటి జంకు లేకుండా కామెంట్స్ చేసాడు. ‘ద అన్‌సూటబుల్‌ బాయ్‌’ పేరుతో కొన్ని రోజుల్లో ఈ ఆత్మకథ విడుదల కానుంది. ఈ పుస్తకంలో సెక్సు, సెక్సు ధోరణి గురించి, షారుక్‌ ఖాన్‌, తన మధ్య సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లపై కరన్‌ జోహర్‌ స్పందించాడు.

‘‘ సెక్స్‌ గురించి నిర్మోహమాటంగా మాట్లాడితే జైల్లో పెట్టే దేశంలో ఉన్నా. అందుకే ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడను. సెక్స్‌ అనేది పూర్తిగా వ్యక్తి గతమైనది. నా సెక్స్‌ జీవితం గురించి రకరకాల ఊహాగానాలు వ్యాపించాయి’’ అని చెప్పాడు. షారూక్‌ ఖాన్‌ మీదా తన మీద ఏన్నో వదంతులు వ్యాపించాయన్నాని చెప్పుకొచ్చాడు. ‘‘ఓ హిందీ టీవీ ఛానల్‌‌లో ఇంటర్‌వ్యూ చేస్తున్న వ్యక్తి నా గురించి, షారూక్‌ గురించి మాట్లాడుతూ ‘మీది అనూహ్యమైన బంధం’ అని వ్యాఖ్యానించాడు. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ‘నీవు నీ సోదరుడితో పడుకుంటున్నావు’ అని నేను అంటే నీకు ఏమనిపిస్తుంది అని ప్రశ్నించాను. దానికి అతడు.. ‘ఏమనుకుంటున్నారు. ఇటువంటి ప్రశ్నను ఎలా అడుగుతున్నారు’ అని అన్నాడు. అప్పుడు నేను ‘అయితే, మీరు నన్ను అటువంటి ప్రశ్నను ఎలా అడుగుతారు’ అని అన్నాను’’ అని కరన్‌ తెలిపారు. షారుక్‌ తనకు తండ్రి సమానుడని, పెద్దన్న లాంటి వాడని చెప్పారు. ఈ వదంతులను షారుక్‌ పట్టించుకోలేదని, జనం నోటికేదొస్తే అది మాట్లాడతారని, వివాహేతర సంబంధాలు లేకపోతే స్వలింగసంపర్కుడిగా ముద్రవేస్తారన్నాడు.

‘‘ఇంతకు ముందు ఎప్పుడూ నేను సెక్స్‌ గురించి మాట్లాడలేదు. నేను హెటెరోసెక్సువల్‌నా, హోమో సెక్సువల్‌నా, బైసెక్సువల్‌నా అన్నది నా వ్యక్తి గతమైన విషయం. నా సెక్స్‌ జీవితం గురించి చాలా జోకులు వేస్తుంటారు. హోమోసెక్సువాలిటీకి ఓ పోస్టర్‌ బాయ్‌గా మారిపోయాను. దీని గురించి నేను బాధపడడం లేదు. ట్విటర్‌‌లో నాపై చాలా నీచంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రతి రోజూ నేను లేచిన వెంటనే దాదాపు 200 ద్వేషపూరితమైన పోస్టులు దర్శనమిస్తాయి. ఈ విషయం గురించి గట్టిగా ఎందుకు మాట్లాడవని నన్ను అడుగుతుంటారు. నా మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. నాకోసం పని చేసే వారికి నేను జవాబుదారిని. నేను అనవసరమైన కేసుల్లో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. అందుకే దాని గురించి గట్టిగా మాట్లాడని వారికి చెబుతా’’ అని కరన్‌ జోహర్‌ తన ఆత్మకథలో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి: బన్నీని రౌండప్ చేసిన పవన్ ఫ్యాన్స్ (వీడియో)

ఇవి కూడా చదవండి: వామ్మో, దేశంలోనే అతిపెద్ద వైన్ షాపు ఇదేనట

English summary

Bollywood Producer, Director and Actor Karan Johar was multi talented and he was very big shot in Bollywood. Recently he was writing a Auto biography of him with the name "The Unsuitable Bhai". In this he put some sensational things about his life.