బిన్నీ భార్యను సూసైడ్ చేసుకోమన్నారు!

Shocking tweets in social media on Mayanti Langer and Stuart Binny

04:47 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Shocking tweets in social media on Mayanti Langer and Stuart Binny

భారతదేశంలో రెండే మతాలు. అందులో ఒకటి సినిమా కాగా మరొకటి క్రికెట్. అయితే ప్రస్తుతం మనం క్రికెట్ అనే మతం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సినిమా గురించి పక్కన పెట్టేద్దాం.. క్రికెట్ ప్రేమికులు క్రికెటర్లను డమ్మీ గాడ్స్ గా ఆరాధిస్తారు. అయితే తేడా వస్తే మాత్రం దారుణంగా విమర్శిస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత విమర్శలు మరీ ఎక్కువైపోయాయి. తాజాగా టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సోషల్ మీడియా నుండి అలాంటి విమర్శలనే ఎదురుకుంటున్నాడు. మొన్న వెస్టిండీస్ తో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లో బిన్నీ 32 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి బిన్నీ సోషల్ మీడియా వైపు చూడాలేకపోతున్నాడు.

ఎందుకంటే బిన్నీపై మాములుగా విమర్శలు చేయడం లేదు. శృతిమించిన విమర్శలు. ఇప్పుడు బిన్నీ భార్య, ప్రముఖ యాంకర్ మయంతి లాంగర్ ని కూడా వదల్లేదు. డబ్బు కోసం బన్నీని చేసుకున్నావాని తెలుసు. ఇంకా బిన్నీతో వుండకు.. విడాకులు ఇచ్చేయ్.. లేదంటే సూసైడ్ చేసుకో ఇలాంటి దారుణమైన ట్వీట్లు కనిపిస్తున్నాయి ట్విట్టర్ లో. నిజంగా దారుణమైన విమర్శలివి. అయితే ఈ ఎపిసోడ్ పై ఆమె గట్టిగా సమాధనం ఇచ్చింది. సూసైడ్ చేసుకోమని చెప్పడం సిగ్గు చేటు. విడాకుల గురించి మాట్లాడుతున్నారు. మీ జీవితంలో అలాంటిది జరగకుండా మీకు మీవారి ప్రేమ దక్కాలని కోరుకుంటున్నా అంటూ విమర్శలకు సమాధనం ఇచ్చింది లాంగర్.

ఇది కూడా చదవండి: ఐసీయూలో శిరీష్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పవన్!

ఇది కూడా చదవండి: అడ్డంగా దొరికేసిన 'లోఫర్' హీరోయిన్

ఇది కూడా చదవండి: భార్యకి కడుపు రావడం లేదని పక్కింటి వాడి మీద కేసు పెట్టాడు.. ఎందుకో తెలిస్తే మతిపోతుంది!

English summary

Shocking tweets in social media on Mayanti Langer and Stuart Binny. Indian fans shocking comments on Stuart Binny and his wife Mayanti Langer.