ఝాన్సీది ఆత్మహత్య కాదా?

Shocking twist in Jhansi Rani suicide case

01:19 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Shocking twist in Jhansi Rani suicide case

కట్టుకున్న భార్యను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ స్టూడెంట్ ఝాన్సీ రాణి మృతి కేసులో ఇప్పుడు మరో కోణం వెలుగు చూస్తోంది. ఝాన్సీ రాణి ఆత్మహత్య చేసుకోలేదని.. కన్న తల్లి, భర్త విజేందర్ కలిసి ఆమెను చంపేశారని పోలీసులు నిర్ధారించారు. తల్లి, భర్తే పురుగుల మందు తాగించి ఝాన్సీ ప్రాణాలు తీశారని పోలీసులు తెలియజేసారు. గత నెల 23న ఝాన్సీని హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోములకు బలవంతంగా తీసుకొచ్చి ప్రాణాలు తీశామని పోలీసుల విచారణలో వారిద్దరూ అంగీకరించారు.

హత్య చేయడమే కాకుండా దానిని ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఒక సవాల్ గా తీసుకున్న పోలీసులు తమ స్టైల్ లో దర్యాప్తు చేసి అసలు నిజాన్ని బయట పెట్టారు. ఝాన్సీ ఫ్రెండ్ సాయిరాంను పోలీసులు విచారించగా వారికి షాకయ్యే నిజాలు తెలిసాయి. ఝాన్సీని కన్నతల్లి, భర్త తరుచూ వేధింపులకు గురి చేసేవారని, వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నారని చెబుతూ ఝాన్సీ రాణి నల్గొండ పోలీసులకు, జిల్లా కలెక్టర్ కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపిన లేఖలో తెలియజేసింది. కన్నతల్లి, భర్త పెట్టే బాధ భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని అంతా అనుకున్నారు. కానీ పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయట పడింది.

English summary

Shocking twist in Jhansi Rani suicide case