ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

Shocking video

10:28 AM ON 30th May, 2016 By Mirchi Vilas

Shocking video

నిజం, ఈ వీడియో అలాంటిదే మరి. కారు దూసుకెళ్ళినా ఓ రెండేళ్ల బాలుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఘటన ఇది. పేరెంట్స్ సూపర్ మార్కెట్ దగ్గర మాట్లాడుకుంటుండగా పార్కింగ్ ఏరియా దగ్గరకొచ్చిన ఈ బాబు ముందున్న వెహికల్ స్టార్ట్ అవడం గమనించాడు. దీంతో ముందుకెళ్లకుండా అక్కడే నిల్చున్నాడు. అయినా గమనించని మినీ వ్యాన్ డ్రైవర్ బాలుడిని కారుతో ఢీకొట్టాడు. దీంతో ముందు రెండు చక్రాల మధ్య పడ్డ పిల్లాడి మీద నుంచి కారు దూసుకెళ్లింది. చుట్టుపక్కల వాళ్లు గమనించి కేకలు వేయడంతో బ్రేక్ వేశాడు మినీ వ్యాన్ డ్రైవర్. దీంతో వెనుక ఉన్న కుడివైపు టైరు ఆ బాలుడ్ని ఆనుకొని ఆగింది.

గుడ్ లక్ ఏంటంటే, అక్కడ నీళ్లుండటంతో తడిచిన టైర్లు బ్రేక్ వేయడంతో అడ్డొచ్చిన ఆ బాలున్ని ముందుకు నెట్టాయి. లేక పోతే టైర్లు బాలుని తల పైకి ఎక్కేసేవి. ఈ ఘటన తూర్పు చైనాలో జియాంగ్సు ప్రావిన్స్ లోని క్సుజోహులో ఉన్న ఓ సూపర్ మార్కెట్ లో చోటు చేసుకుంది. సిసిటివిలో రికార్డయిన ఈ దృశ్యాలు నెట్ లో చక్కర్లు కొడుతూ, షాక్ కు గురి చేస్తున్నాయి.

English summary

Shocking video. Shocking incident that happened in East China that was a accident.