యాక్సిడెంట్ తర్వాత మనిషి ఆత్మ ఇలా గాల్లోకి ...(షాకింగ్ వీడియో)

Shocking Video Shows Womans Soul leaves her Body

10:53 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Shocking Video Shows Womans Soul leaves her Body

ఇన్నాళ్లు మనిషి చనిపోతే ఆత్మ ఎలా వెళుతుందని రకరకాల చర్చలు సాగుతూనే వున్నాయి. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడ.. ఎలా వుంటుంది? జ్యోతి మాదిరిగానే వుంటుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతూనే వున్నారు. ఇక కొంతమంది పరిశోధకులు కూడా ఇదే నిజమని అంటున్నారు. అయినా సరే, కచ్చితమైన ఆధారాలేవీ లేవనే మాట వినిపిస్తోంది. మరణం శరీరానికే తప్ప ఆత్మకు ఉండదని జ్ఞానులు, ఆధ్యాత్మిక గ్రంధాలు ఇప్పటికీ చెబుతున్నమాట. ఇటీవల జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రోడ్డు ప్రమాదంలో సీసీ కెమెరాకు చిక్కిన ఫుటేజీ.. నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకి రెండురోజుల్లో సుమారు 5 లక్షలపైగా హిట్స్ వచ్చాయి.

రోడ్ క్రాస్ చేస్తున్న కారుని వేగంగా వస్తున్న టూ వీలర్స్ ఢీకొట్టింది. స్కూటరిస్టు అక్కడికక్కడే మరణించగా, ఆ వ్యక్తిలో ఆత్మ లేచి అక్కడ నిలబడినట్టు గా వీడియోలో కనిపించింది. ఒకవిధంగా చెప్పాలంటే ఇది ఆశ్చర్యమే! ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తంచేస్తుంటే.. మరి కొందరు అది ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. టెక్నాలజీని వినియోగించి గ్రాఫిక్స్ తో చేసి ఉండొచ్చని అంటున్నారు. ఏదో విధంగా ఆ వీడియో య్యూట్యూబ్ లో హంగామా చేస్తోంది. వీరలెవెల్లో కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

Shocking Video Shows Woman’s Soul leaves her Body. Woman’s Soul leaves her Body after deadly motorbike crash. This video goes viral..