కేజ్రీవాల్‌పై బూటు - సిడి  విసిరిన యువకుడు

Shoe Attack On Aravind Kejriwal

11:25 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Shoe Attack On Aravind Kejriwal

ఆ మధ్య విలేకరుల సమావేశంలో, మీటింగుల్లో నేతలపై బూట్లు విసిరిన సంఘటనలు చూసాం. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఓ యువకుడు దాడికి ప్రయత్నించాడు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి రెండో విడత సరి-బేసి సంఖ్య వాహనాలకు అనుమతి గురించి సచివాలయంలో మీడియా సెంటర్‌లో సీఎం విలేకర్లతో మాట్లాడుతుండగా... వేద ప్రకాశ్‌(28) అనే వ్యక్తి కేజ్రీవాల్‌పైకి బూటు, ఓ సీడీని విసిరాడు. అయితే, ముఖ్యమంత్రికి తగలకుండా భద్రతా సిబ్బంది చాకచక్యంగా అడ్డుకోవడంతో అవి పక్కకు పడ్డాయి. ఇంతకీ విలేకరి ముసుగులో ప్రకాశ్‌ ఈ సమావేశానికి వచ్చి, ఏకా ఎకైనా బూటు విసరలేదు. సీఎం మాట్లాడుతుండగా... పలు ప్రశ్నలు వేసి ప్రసంగానికి ఆటంకాలు సృష్టించాడు. సీఎన్‌జీ ఇంజిన్‌ సర్టిఫికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, ఇందుకు సంబంధించిన స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియో సీడీ కూడా తన వద్ద ఉందని ఆ యువకుడు గట్టిగానే వాదించాడు.

ఇవి కూడా చదవండి : ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

ఈ విషయమై తాను ఫిర్యాదు చేశానని, ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని పెద్దగా కేకలు వేస్తూ సీఎంపై ఆ యువకుడు బూటు, సీడీ విసిరేశాడు. దీంతో, అక్కడే ఉన్న ఆప్‌ నాయకులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆప్‌ వాలంటీర్లు అతడిని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. అనంతరం కేజ్రీవాల్‌ మీడియా సమావేశం కొనసాగించారు. వేద ప్రకాశ్‌ను ఆప్‌ నుంచి చీలిపోయిన ఆమ్‌ ఆద్మీ సేన కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. సభలు, సమావేశాల్లో కేజ్రీవాల్‌పై ఇలా దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. గత జనవరిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భావనా అరోరా అనే మహిళ కేజ్రీవాల్‌పై ఇంకు చల్లారు. అలాగే 2014లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కూడా కేజ్రీవాల్‌పై భౌతిక దాడులు జరిగాయి. కాగా, కేజ్రీవాల్‌పై తాజా దాడిని రాజకీయ పార్టీలు ఖండిచాయి. కేజ్రీవాల్‌ ఒంటెత్తు, నిరంకుశ పాలనపై ప్రజాగ్రహానికి ఈ దాడి నిదర్శనమని కాంగ్రెస్‌ నేత పీసీ చాకో వ్యాఖ్యానించారు. ఏదేమైనా సీఎంపై దాడిని తమ పార్టీ ఖండిస్తోందన్నారు. ఇలాంటి దాడులను అడ్డుకునే చర్యలు అవసరమని బీజేపీ నేత నళిని కోహ్లీ వ్యాఖ్యానించారు. తరచూ కేజ్రీపై ఎందుకు దాడులు జరుగుతున్నాయో అత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ వ్యాఖ్యానించారు. కాగా ఈ దాడికి ముందు బీజేపీ నేత ఒకరితో వేద ప్రకాశ్‌ ఫోన్‌లో మాట్లాడారని, దీనిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ మంత్రి కపిల్‌ మిశ్రా డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి : మైనర్ అనుమతితో సెక్స్ చేసినా శిక్ష తప్పదట

ఇవి కూడా చదవండి :

క్రిష్ కి ఆ పేరు అమెరికా అమ్మాయి పెట్టిందా?

హీరో వేణు దంపతుల పై కేసుసంచలనం..

English summary

A Aam Admi Party leader throws Shoe and Cd on Delhi Chief Minister Aravind Kejriwal during Press Conference in Delhi.That guy says that Aam Admi Party was doing some illegal actions . That Man was arrested and police taken him into their custody.