స్వీట్స్ లో గంజాయి పెట్టి అమ్ముతున్న దూకాణా దారుడు..

Shopkeeper arrested for including ganja in sweets

05:07 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Shopkeeper arrested for including ganja in sweets

మనం తినే తిండి, శీతల పానీయాలలో మత్తు పదార్ధాలు కలిపి అమ్మడం సినిమాల్లో చూస్తూ ఉంటాం.. బయట పెద్ద పెద్ద సిటీల్లో చూస్తూ ఉంటాం.. తాజాగా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. మత్తుపదార్థాలతో కూడిన చాక్లెట్లు, పీచుమీటాయి లాంటివి చిన్నారులకు విక్రయిస్తున్న ఓ దుకాణాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తాండియర్ పేట్ లో చోటుచేసుకుంది. నింధితుడిని పోలీసులు జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గతవారం ఓ పదమూడేళ్ల బాలుడు తాండియర్ పేట్ లోని ఓ దుకాణంలో స్వీట్ కొనుక్కున్నాడు.

అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా తిన్న స్వీట్ లో మత్తుపదార్థాలు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో డ్రగ్స్ నివారణ చట్టం కింద సురేశ్ మహోలా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆ బాలుడికి విక్రయించిన చాక్లెట్స్ ప్యాకెట్లను ఆరింటిని స్వాధీనం చేసుకొని టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపించారు. వీటిని పరీక్షించగా వీటిల్లో కూడా గంజాయి ఆకులతో తయారు చేసిన మిశ్రమం ఉన్నట్లు గుర్తించారు.

English summary

Shopkeeper arrested for including ganja in sweets