శౌర్య ఆడియో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Showrya Audio Release Date

11:33 AM ON 27th January, 2016 By Mirchi Vilas

Showrya Audio Release Date

మంచు వారి వారసుడు మంచు మనోజ్‌ తన విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. మనోజ్‌ నటిస్తున్నతరువాత సినిమా శౌర్య. ఈ సినిమా రొమాంటిక్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కనుంది. ఇప్పటి వరకూ యాక్షన్‌ సినిమాలలో నటించిన మంచు విష్ణు మొదటిసారి ఒక రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఘాటింగ్‌ మొత్తం పూర్తయ్యింది. ఈ సినిమాని ఫిబ్రవరి నెలలో విడుదల చెయ్యడానికి సినిమా యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 31 న ఈ సినిమా ఆడియోను విడుదల చెయ్యడానికి రంగం సిద్దం చేశారు. ఈ ఆడియో విడుదల హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో జరగనుంది. ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలతో మెప్పించిన దర్శకుడు దశరధ్‌ ఈ సినిమా ద్వారా మొదటిసారి చేస్తున్న రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది. ఈ సినిమాలో రెజీనా కసాండ్రా మనోజ్‌ తో జతకట్టనుంది. ఈ సినిమాలో మనోజ్‌ ఒక ఫార్మాసిటికల్‌ ఇంజనీర్‌గా క్లాస్‌లుక్‌ లో కనిపించనున్నాడు.

English summary

Manchu Manoj's upcoming film Showrya Audio release date was announced by the film unit.This movie audio was to be launch at January 31st in Shilpakala Vedika in Hyderabad.Dasaradh Was director to this film and Regina Cassandra acted as heroine.