డిక్టేటర్‌లో శ్రద్ధాదాస్‌ ఐటమ్‌సాంగ్‌!!

Shraddha Das doing item song in Dictator

05:48 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Shraddha Das doing item song in Dictator

నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99 వ చిత్రం డిక్టేటర్‌. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఏకంగా ముగ్గురు కధానాయకులు. అంజలి, సోనాల్‌చౌహన్‌ మరియు అక్ష. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇందులో ఒక ఐటమ్‌సాంగ్‌ ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఐటమ్‌సాంగ్‌ కోసం గోవా బికినీ బ్యూటీ ఇలియానాని సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు ఈ అవకాశం సెక్సీ సుందరి శ్రద్ధాదాస్‌ని వరించింది. ఈ ఐటం సాంగ్‌లో శ్రద్ధాదాస్‌తో పాటు మరో హీరొయిన్‌ కూడా కనిపించబోతుందట కానీ ఆ హీరోయిన్‌ ఎవరన్నది స్పష్టత తెలీదు.

ప్రస్తుతం ఢిల్లీలో ఆ పాటని తెరకెక్కిస్తున్నారు, డిసెంబర్‌ 3 వరకు అక్కడే చిత్రీకరణ జరుగుతుంది. 4 నుండి హైదరాబాద్‌లో ఫైట్స్‌ని చిత్రీకరిస్తున్నారు, దాంతో చిత్రీకరణ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

English summary

Shraddha Das doing item song in Dictator movie. Dictator is directing by srivass and lead heroines is Anjali, Sonal Chauhan, Aksha.