మళ్లీ తల్లి అయిన శ్రియ!

Shriya again acting in mother character

01:05 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Shriya again acting in mother character

దాదాపు దశాబ్ధం పాటు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియ సరణ్ ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో ఐటమ్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అవి కూడా తగ్గడంతో తల్లి పాత్రలు చేస్తూ కాలాన్ని నెట్టుకొస్తుంది. ఇప్పటికే గోపాలా గోపాలా, హిందీ దృశ్యం సినిమాల్లో తల్లిపాత్రల్లో కనిపించిన ఈ హాట్ బ్యూటీ.. మరోసారి బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలోనూ తల్లి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రియ శాతకర్ణి భార్యగా.. ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్లో శ్రియ జాయిన్ కానుంది.

బాలయ్య కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయేలా దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడో.. అదే స్థాయిలో బాలయ్య, శ్రియ క్యారెక్టర్లను మలిచినట్లు ఇన్ సైడ్ సమాచారం. శాతవాహనుల కాలంలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన శాతకర్ణి లాగే బాలయ్య పాత్రను, ఆయన భార్య అయిన వశిష్టా దేవిలాగే శ్రియ క్యారెక్టర్ ను క్రిష్ మలిచాడని.. వీరిద్దరికి తమతమ క్యారెక్టర్లు కెరీర్ లో గుర్తుంచుకునేవిధంగా వుంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి.. శ్రియాకి చాలాకాలం నిరీక్షణ తర్వాత ఓ బ్లాక్ బస్టర్ ఆఫర్ నే దక్కించుకుందని చెప్పుకోవచ్చు. మరి.. ఈ మూవీతో ఆమె కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

English summary

Shriya again acting in mother character