వశిష్టి దేవిగా శ్రేయ అదిరింది

Shriya Attracts With Her New Look In Gautamiputra Satakarni

10:38 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Shriya Attracts With Her New Look In Gautamiputra Satakarni

హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్ లో కూడా అదరగొట్టేసిన హీరోయిన్ శ్రేయ ఇప్పుడు మహారాణి అయింది. అదేనండి కంచె సినిమాతో నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకున్న జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో శ్రేయ నటిస్తోంది కదా.

ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైయివేట్ లిమిటెడ్ బ్యానర్ పై వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శాతకర్ణిగా బాలయ్య, ఆయన తల్లి గౌతమిగా సీనియర్ నటి హేటిమమాలిని నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రియా శరణ్ నటిసున్నా, ఆమె పాత్రకు సంబంధించి ఏ విషయాన్ని కూడా చిత్ర యూనిట్ బయటకు పొక్కనీయలేదు.

అయితే శ్రియా శరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్ర పేరును తెలియజేసేలా ఉన్న ఓ పోస్టర్ ను దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశాడు. అందులో శ్రియ పాత్రపేరు వశిష్టి దేవిగా ఉంది. శాతకర్ణి భార్య వశిష్టి మహారాణి లుక్ లో శ్రియా ఆకట్టుకుంటోంది. అన్నట్టు ఈ భామ కు 34 ఏళ్ళు నిండాయి.

English summary

At present director heroine Shriya was acting in BalaKrishna's 100th movie and this movie shooting was going fastly and today was the Birthday of Shriya and director krish released the first look of her from Gautamiputra Satakarni Movie. She was acting in a role named "Vashisti Devi" in the movie.