సినిమాల కంటే ఆ సంపాదనే ఎక్కువ

Shriya is earning money with public events

10:32 AM ON 6th July, 2016 By Mirchi Vilas

Shriya is earning money with public events

శ్రియ అనగానే ఓ టాపు లెవెల్లో హీరోయిన్ గా అదరగొట్టేసి, మరో పక్క ఐటెం సాంగ్ లలో కూడా తానే సాటి అనిపించుకుంది. అందం ఉంటే చాలు.. వయస్సుతో పనేమిటి అనేలా ఉంటుంది ఈ అమ్మడి యవ్వారం. అందుకే ఈమె 35 సంవత్సరాల వయస్సు.... 16 సంవత్సరాల ఇండస్ట్రీ సీనియార్టీ వున్నా పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని అస్సలు ఆలోచించలేదు. ఈ వయస్సులో కూడా వన్నెతరగని సొగసుతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తూనే ఉంది. అంతే కాక తమిళంలో హీరో శింబూకు తల్లి పాత్రలో శ్రియ నటించనుంది. నటనకు ప్రాధాన్యం ఉన్నందునే తల్లి పాత్ర చేయడానికి ఒకే అందట.

అడపాదడపా సినిమాల్లో కనిపిస్తునే, బయట ఈవెంట్ల ద్వారా శ్రియ బాగా సంపాదిస్తోందని సినీ జనాలు అంటున్నారు. ఈవెంట్ల ద్వారా ఏడాదికి కనీసం రెండు మూడు కోట్లు సంపాదిస్తోందట. ఉత్తరాదిన జరిగే ర్యాంప్ వాక్ లలో శ్రియ తప్పనిసరిగా పాల్గొంటుంది. వీటన్నిటి ద్వారా సినిమాల కన్నా ఎక్కువగా శ్రియ సంపాదిస్తోందనేది బాలీవుడ్ జనాల మాట! సినిమాలు లేకపోయినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం శ్రియాకే చెల్లిందంటున్నారు. ఏ సినిమా ఈవెంట్ అయినా, అవార్డు ఫంక్షన్ అయినా శ్రియా డ్యాన్స్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక 5కె-10కె రన్ లాంటివాటికి శ్రియనే బెస్ట్ చాయిస్!

ఇక రిబ్బన్ కటింగ్ లు సరేసరి. రెండు చేతులా సంపాదన పెంచేసిన శ్రియ మరి పెళ్లి పీటలు ఎక్కేది ఎప్పుడో మరి.

English summary

Shriya is earning money with public events