శ్రియకే బాలయ్య ఓటు పడిందట..

Shriya Saran in Balakrishna 100th movie

10:34 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Shriya Saran in Balakrishna 100th movie

బాలయ్యబాబు ప్రతిష్టాత్మక 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలో హీరోయిన్ కన్ఫామ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ కి రంగం సిద్ధం అవుతున్న నేపధ్యంలో శ్రియను బాలకృష్ణ జోడీగా మూవీ యూనిట్ ఎంపిక చేసింది. వాస్తవానికి బాలయ్య సరసన మొదట నయనతారను తీసుకోవాలని భావించినా ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. దీంతో డైరెక్టర్ క్రిష్ శ్రియని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక.. శాతకర్ణి భార్య వాసిష్ట పాత్రలో శ్రియ ఒదిగిపోనుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న బాలకృష్ణ తన పుట్టినరోజైన ఈనెల 10వ తేదీన గౌతమీ పుత్ర శాతకర్ణి టీజర్ ని రిలీజ్ చేస్తారు.

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి సినిమాలో నటించిన శ్రియ, త్వరలో జరిగే శాతకర్ణి మూడో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటుంది.

English summary

Shriya Saran in Balakrishna 100th movie