ఆ స్టార్ క్రికెటర్ తో శ్రియ డేటింగ్!

Shriya Saran love affair with Dwayne Bravo

03:14 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Shriya Saran love affair with Dwayne Bravo

2001లో ఉషాకిరణ్ మూవీస్ 'ఇష్టం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ దాదాపు 15 సంవత్సరాలుగా హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు హీరోయిన్ ఛాన్సులు తక్కువైనా సీనియర్ హీరోలతో మాత్రం వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది. నాగార్జునతో మనం, బాలయ్యతో శాతకర్ణి, వెంకీతో గోపాల సినిమాల్లో ఆమె జోడీ కట్టి మెప్పించింది. కెరీర్ ప్రారంభించినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయింటెన్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సుదర్ఘీ కెరీర్ లో ఎవరితోనూ ఎఫైర్ లు, బ్రేకప్ లు లేకుండా గడిపేసిన ఈ బ్యూటీ.. ఇన్నాళ్లకు ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె డేటింగ్ చేస్తోంది ఏ హీరోతోనో, బిజినెస్ మేన్ తోనో కాదు ఓ క్రికెటర్ తో అట.

1/3 Pages

ప్రస్తుతం శ్రియ బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో యువరాణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ ఆల్రౌండర్, డ్యాన్సింగ్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో శ్రియ లవ్ ట్రాక్ నడుపుతోందనే వార్తలు పుట్టుకొచ్చాయి. విండీస్ క్రికెటర్ అయినప్పటికీ భారత్ అంటే బ్రావోకు ఎంతో ఇష్టం. ఐపీఎల్ తో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ, పాటలు పాడుతూ, ఓ హిందీ రియాల్టీ షోలో పాల్గొంటూ ఇండియాతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా శ్రియ, బ్రావో డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా అంటోంది.

English summary

Shriya Saran love affair with Dwayne Bravo