శాతకర్ణితో జోడీ కట్టనున్న శ్రియ

Shriya Saran selected as a heroine in Goutamiputra Satakarni

04:01 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Shriya Saran selected as a heroine in Goutamiputra Satakarni

నందమూరి బాలయ్య 100వ చిత్రంగా తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి రెండో షూటింగ్ షెడ్యూల్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో కథానాయికగా రకరకాల పేర్లు వినపడుతున్నాయి. అయితే ఈ వరుసలో ముందు శ్రియ, తరువాత నయనతార, ఇలియానా ఉన్నట్లు సినీ పరిశ్రమ వర్గాల టాక్. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలనాటి నటి హేమమాలిని ఈ చిత్రంలో బాలకృష్ణ తల్లి పాత్రను పోషిస్తుండగా, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం తొలి షూటింగ్ షెడ్యూల్ను మొరాకోలో పూర్తి చేసుకుంది.

English summary

Shriya Saran selected as a heroine in Goutamiputra Satakarni. Hot beauty Shriya Saran is acting as a queen in Balakrishna 100th film.