శ్రియ అందరినీ ఇష్టపడిందట.. కానీ పెళ్లి మాత్రం...

Shriya talks about her marriage

10:27 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Shriya talks about her marriage

సినిమాల్లోకి వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలైనా సరే, శ్రియ శరన్ మూడు పదుల వయస్సు దాటినా వన్నె తరగని లావణ్యంతో అభిమానులనూ, ప్రేక్షకులనూ అలరిస్తూనే ఉంది. గతంలో లాగా వరుస పెట్టి సినిమాలు చేయకపోయినా హిందీ, తెలుగు, తమిళం సినిమాల్లో ఒక్కొక్క సినిమా చొప్పున చేస్తూ వెండి తెర మీద మెరుపులు మెరిపిస్తూనే ఉంది. ఐటెం సాంగ్ లలో సైతం కుమ్మేసింది. ఇక తాజాగా బాలకృష్ణ నూరవ సినిమాలో హీరోయిన్ గా కూడా శ్రియ ఛాన్స్ కొట్టేసింది. అయితే సినిమాల్లో ఉండగా ఎవరైనా ఇష్టపడడం గానీ, డేటింగ్ గానీ, చేసిందా అంటే ఆసక్తికరంగా సమాధానం ఇస్తోంది.

నిజం చెప్పాలంటే నాతో పాటు చేసిన హీరోలందరినీ ఇష్టపడ్డా. కానీ ఎవరినీ పెళ్ళి చేసుకోవాలని అనిపించలేదు. కానీ నేను ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానంటూ చాలా సార్లు పుకార్లు వచ్చాయి. వాటిని నాతో పాటు ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. మొన్నటికి మొన్న అండమాన్ వెళ్ళినప్పుడు కూడా లవర్ తో కలిసి డేటింగ్ కి వెళ్ళానని అన్నారు. అక్కడికి నేను ఒక్కదాన్నే వెళ్ళా. అదీ మా పేరెంట్స్ కి చెప్పి మరీ వెళ్ళా. ఇక పెళ్ళి గురించి మా పేరెంట్స్ కి వదిలేశా. నాకు తగిన వ్యక్తిని వారే సెలక్ట్ చేస్తారు. నా దృష్టిలో ఎవరూ లేరు. నేను ఎవరినీ ప్రేమించలేదు అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ఇదంతా నిజమేనా అంటూ సినీలవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

English summary

Shriya talks about her marriage