ఎన్నారై బిజినెస్ మెన్ తో శృతి హాసన్ పెళ్లి!

Shruthi Haasan marriage with NRI Business man

04:41 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Shruthi Haasan marriage with NRI Business man

'లక్' చిత్రంతో తన లక్ ని పరీక్షించుకున్న లోక నాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ మొదటి చిత్రమే అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఆ తరువాత తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో సిద్ధార్ధ్ సరసన నటించింది. ఆ చిత్రం కూడా అట్టర్ ప్లాప్ కావడంతో శృతికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆ తరువాత సూర్య సరసన 'సెవెంత్ సెన్స్' చిత్రంలో నటించింది. ఆ చిత్రం కధ బానే వున్నా సరిగా ఆడలేదు. దీంతో శృతిది ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. అయినప్పటికీ కమల్ హాసన్ కూతురు కావడంతో అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత 'ఓ మై ఫ్రెండ్' చిత్రంలో నటించింది. అది కూడా యావరేజ్ గా నిలిచింది.

అయితే 2012లో పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో శృతి లక్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక్కడ నుండి శృతికి అవకాశాలు క్యూ కట్టాయి. బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, రేస్ గుర్రం, శ్రీమంతుడు వంటి చిత్రాల్లో నటించిన శృతి ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది. శృతి తెలుగులోనే కాకుండా అటు తమిళ్, హిందీలో కూడా చాలా సినిమాల్లో నటించింది, నటిస్తుంది. ఈ మూడు భాషల్లో శృతి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. శృతి హాసన్ ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న 'ప్రేమమ్' లో టీచర్ మలర్ పాత్ర చేస్తోంది.

అలాగే పవన్ సరసన డాలీ తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శృతి కెరీర్ పీక్స్ స్టేజ్ లో ఉండగా నెక్స్ట్ ఇయర్ ఒక ఎన్నారై బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త తమిళ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ వార్తపై శృతి స్పందించింది. ఒకసారి ఆ ట్వీట్ ని చూసేద్దామా..

1/3 Pages

పెళ్ళని వచ్చిన వార్త ఇదే..


శృతి హాసన్ పెళ్ళని వచ్చిన వార్త ఇదే.. ఇది చూసే అభిమానులు ఖంగారు పడ్డారు.

English summary

Shruthi Haasan marriage with NRI Business man