విశాఖ అందాలకు శృతి ఖుషీ ...

Shruthi Hassan Enjoys Weather in Vizag

10:49 AM ON 9th July, 2016 By Mirchi Vilas

Shruthi Hassan Enjoys Weather in Vizag

ఇప్పటికే నాలుగైదు ప్రాజెక్ట్లతో బిజీగావున్న హీరోయిన్ శృతిహాసన్, తాజాగా నటిస్తున్న సింగం-3 మూవీ షూటింగ్ విశాఖలో జరుగుతోంది. ఆర్ కె బీచ్, భీమునిపట్నం వంటి ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను సూర్య- శృతిలపై డైరెక్టర్ చిత్రీకరిస్తున్నాడు. వైజాగ్ రోడ్లపై చక్కర్లు కొడుతోన్న శృతికి అక్కడి వాతావరణం బానే నచ్చేసింది.

బీచ్ అందాలకు ఎట్రాక్ట్ అయిన ఈ అమ్మడు.. టాప్ యాంగిల్ నుండి తీసిన ఓ పిక్ ని, ఆ తర్వాత మరొక ఫోటోను కెమెరాతో క్లిక్ మనిపించి అభిమానులతో షేర్ చేసుకుంది. వైజాగ్ లో వాతావరణం చాలా ఆహ్లదకరంగా ఉందంటూ రాసుకొచ్చింది. తనకు రెండు ఇష్టమైనవి ఉన్నాయని, అందులో ఒకటి వర్షం కాగా, మరొకటి సముద్రం అని చెప్పింది. మొత్తానికి విశాఖ అందాలకు శృతి ఖుషీ ఐపోయిందంటూ కామెంట్స్ పడుతున్నాయి

English summary

Crazy Heroine Shruti Hassan was yesterday went to Vizag for the movie shooting of Singam 3 and she likes the weather of Vizag and she shares pics of Vizag beach and shred in social media.