పవన్ కళ్యాణ్ తో కలిసి దీపాలు వెలిగించిన శృతి హాసన్!

Shruti Haasan and Pawan Kalyan in katamarayudu motion poster

04:18 PM ON 31st October, 2016 By Mirchi Vilas

Shruti Haasan and Pawan Kalyan in katamarayudu motion poster

దీపావళి పండుగను దేశమంతటా ఆనందోత్సాహాలతో ప్రజలు జరుగుపుకున్నారు. దీపాలు వెలిగించడం, బాణాసంచా కాల్చడం సరేసరి. కానీ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కలిసి దీపాలు వెలిగిస్తున్నారు. పవన్ నటిస్తోన్న తాజా సినిమా కాటమరాయుడు మూవీ విడుదలకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అయితే దీపావళి పండుగ సందర్భంగా కాటమరాయుడు సినిమా మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ శృతి హాసన్ కలిసి దీపాలను వెలిగిస్తూ కనిపించారు. పవన్ దీపం వెలిగిస్తూ ఉండగా శృతి చేతిలో దీపంతో పవన్ ను చూస్తూ ఉంది. మొత్తం 20 సెకండ్ల పాటు కనిపించే ఈ పోస్టర్ ను అభిమానుల కోసం దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా విడుదల చేశారు.

English summary

Shruti Haasan and Pawan Kalyan in katamarayudu motion poster