పాపం శృతి అకౌంట్‌లో కృతిసనస్‌ ఫోటోలు 

Shruti Haasan Facebook account Hacked

01:08 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Shruti Haasan Facebook account Hacked

ఇటీవల చాలా సెలబ్రిటీ అకౌంట్స్ హ్యాక్‌ అవుతున్నాయి. ఆ లిస్టులో శృతిహాసన్‌ కూడా ఉంది. ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాను ఎవరో గుర్తు తెలియని వారు హ్యాక్‌ చేశారు. ఈ విషయంగా శృతిహాసన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా 'నా ఫేస్‌బుక్‌ లో వచ్చే పోస్టులను పట్టించుకోవద్దని’ తెలిపారు. అలాగే ప్రస్తుతం దాన్ని సెట్‌ చేసే పనిలోనే ఉన్నాయని అప్పటి వరకూ నా ప్రొపైల్‌ ని పట్టించుకోవద్దని థ్యాంక్‌ అంటూ ట్వీట్‌ చేసింది ఈ భామ. టెక్నికల్‌ టీం హ్యాక్‌ కు గురైన శృతిహాసన్‌ ఫేస్‌బుక్‌ ఖాతాను చేధించడంలో బిజీగా ఉందని వివరించారు. ఇదిలా ఉండగా హ్యాక్‌ చేసిన వారు ఎవరో గానీ కృతిసనన్‌ కి వీరాభిమాని అనుకుంట. అందుకేనేమో శృతిహాసన్‌ అకౌంట్‌ లో కృతిసనన్‌ పోటీలను పోస్ట్‌చేస్తున్నాడు. అదికూడా ఓపిగ్గా కృతిసనన్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రమ్‌ లో నుంచి పట్టుకొచ్చి మరీ పోస్ట్‌ చేస్తున్నాడు.

English summary

"Some jackass has hacked my Facebook account and we are working on fixing it ! Till then . Kindly ignore ! Thanks," Shruti Haasan posted on Twitter, alerting her fans.