రెండు విభిన్న పాత్రల్లో 'శృతిహాసన్'!!

Shruti Hassan acting in two different roles

04:17 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Shruti Hassan acting in two different roles

సౌత్‌ ఇండియన్ హాట్ బ్యూటీ శృతిహాసన్ వరుస చిత్రాలు చేస్తూ బిజీ గా గడుపుతుంది. శృతిహాసన్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్‌ 'ప్రేమమ్‌' తెలుగులో రీమేక్‌ అవుతున్న 'మజ్ను' చిత్రంలో నాగ చైతన్య సరసన నటిస్తుంది. ఇందులో చైతూకి లెక్చరర్‌గా శృతి నటించబోతుంది, అందుకోసం ప్రత్యేకంగా చీరలు కూడా తెప్పించుకుంది. మరొకటి తమిళ స్టార్‌ హీరో సూర్య సూపర్‌ హిట్‌ మూవీ సీరీస్ అయిన 'సింగం 3' లో అనుష్కతో పాటు శృతిహాసన్ కూడా సిఐడి ఆఫీసర్‌గా కనిపించబోతుంది. సూర్యకి అసిస్టెంట్‌గా శృతిహాసన్ నటిస్తుంది. సూర్యతో పాటు శృతి 'సింగం 3' లో కొన్ని యాక్షన్‌ సీన్స్‌లో కనిపించనుంది.

అందుకోసం సూర్యతో కలిసి కొన్ని యాక్షన్‌ మెళుకువలను కూడా శృతి నేర్చుకుంటుంది. కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌ హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మజ్ను, సింగం 3 రెండు చిత్రాలు 2016 వేసవిలో విడుదల కాబోతున్నాయి. అంటే రెండు విభిన్న పాత్రల్లో శృతిని మీరు ఒకేసారి చూడొచ్చు.

English summary

Shruti Hassan acting in two different roles in two different movies. One movie is Naga Chaitanya's Majnu and another one is Surya's Singham-3.