తండ్రితో నటించనున్న 'శృతిహాసన్‌'?!!

Shruti Hassan acting with his father

03:52 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Shruti Hassan acting with his father

యూనివర్సిల్‌ హీరో కమల్‌హాసన్‌ తనయగా సినీరంగ ప్రవేశం చేసిన శృతిహాసన్‌ అనతి కాలంలోనే టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే శృతిని చాలా ఇంటర్వ్యూల్లో మీ తండ్రి కమల్‌హాసన్‌ తో ఎప్పుడు నటించబోతున్నారు అని అడగగా అవకాశం రావాలే కానీ అంత కంటే అదృష్టమా అని చాలా సార్లు బదులిచ్చింది శృతి. ఇప్పుడీ అవకాశం వచ్చినట్లే ఉంది, కమల్‌ కి మంచి మిత్రుడైన మలయాళ దర్శకుడు రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వంలో కమల్‌-శృతి తండ్రీ కూతుళ్లుగా నటించబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శృతిహాసన్‌ ని ఈ చిత్రంలో నటింపజేయాలని రాజీవ్‌ కమల్‌ని కోరారట.

అయితే కమల్‌ ససేమిరా అన్నా ఆ తరువాత శృతిని నటింపజేయడానికి అంగీకరించారట. ఈ చిత్రంలోనే కాకుండా కమల్‌-శృతి మరో సినిమాలో కూడా నటించే అవకాశాలున్నాయట. వీరిద్దరూ కలిసి నటిస్తే స్క్రీన్‌ పై చూడాలని ఎంతో మంది సినీ ప్రియులు, కమల్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

English summary

Shruti Hassan acting with his father Kamal Hassan in her upcoming movie. Rajeev Kumar is directing this film.