వేశ్య అవతారంలో అదరగొట్టిన శృతిహాసన్(వీడియో)

Shruti Hassan Be The Bitch video

10:37 AM ON 15th October, 2016 By Mirchi Vilas

Shruti Hassan Be The Bitch video

కథానాయిక శృతిహాసన్ నటించిన ఓ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో సంచలనం సృష్టిస్తోంది. ఆమె నటించిన 'బి ద బిచ్' అనే వీడియో తాజాగా విడుదలైంది. మహిళలను కించపరుస్తూ మాట్లాడే ఆ పదానికి శృతిహాసన్ ఈ వీడియోలో అర్థాన్ని తెలుపుతూ.. మహిళా శక్తిని తెలియ జెప్పింది. ఈ వీడియోను శృతిహాసన్ నే రచించడం మరో విశేషం. కల్చర్ మిషన్స్ డిజిటల్ ఛానెల్స్ బ్లష్ దీనిని పబ్లిష్ చేసింది. ఇదే ఛానెల్ కోసం రాధికా ఆప్టే, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు కూడా పనిచేశారు. బిచ్ అంటే సిస్టమ్ ని అధిగమించి నిలబడే ఓ ఉపాధ్యాయిని, అన్నీ పనులను ఒకే చేత్తో చేసే వ్యక్తి. అందుకే ఆమెకు మిమ్మల్ని క్షమించే సమయం ఉండదు.

స్వచ్ఛమైన ఆశయం, హార్మోన్లతో ఉన్న వ్యక్తే ఆమె అంటూ శృతిహాసన్ తన వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. రానా దగ్గుబాటి, త్రిష, అర్జున్ రామ్ పాల్, సుషాంత్, శ్వేతా పండిత్ తదితరులు ట్విట్టర్ వేదికగా శృతిహాసన్ ను అభినందించారు. మరి మీరు కూడా పూర్తి వీడియో పై ఓ లుక్కెయ్యండి.

English summary

Shruti Hassan Be The Bitch video