శృతిహాసన్‌ లో ఈ యాంగిల్ కూడా ఉందా!!

Shruti Hassan donates 12 lakhs

10:49 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Shruti Hassan donates 12 lakhs

స్టార్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ తన 30వ పుట్టినరోజు వేడుకులను నిరాడంభరంగా జరుపుకుంది. చూపు మందగించిన పిల్లల పాఠశాల 'లిటిల్‌ ఫ్లవర్ హోమ్‌ ఫర్ బ్లైండ్' వద్ద విద్యార్ధులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. శృతి వాళ్ళతో రోజంతా చాలా మంచిగా సమయాన్ని గడిపింది. అక్కడున్న పిల్లలందరితో కలిసి కేక్‌ కత్తిరించి పిల్లలందరికీ తినిపించింది. అంతేకాకుండా అక్కడున్న పదివేల మంది పిల్లలకి మరియ సిబ్బందికి భోజనాలు పెట్టింది. శృతి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటింది. మరియు పాఠశాల ఫర్నిచర్ కి మరియు స్టేషనరీకి 12 లక్షలు విరాళం ఇచ్చింది.

ఈ సందర్భంగా శృతి మీడియాతో మాట్లాడుతూ ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే విద్యార్ధులతో సమయాన్ని గడిపే అవకాశం నాకు వచ్చింది. వాళ్ళతో గడిపిన క్షణాలు నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని చెప్పింది.

English summary

Hot beauty Shruti Hassan donates 12 lakhs on her Birthday occasion to blind children school. With this birthday she turned to 30 years old.