అతిధి పాత్రలో 'శృతిహాసన్‌'

Shruti Hassan in guest role

01:46 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Shruti Hassan in guest role

కొన్ని సినిమాలలో పాత్రలు తెర పై కనిపించే సమయం తక్కువే అయినప్పటికీ, ఆ పాత్రలు సినిమాకి చాలా కీలకంగా ఉంటాయి. సినిమాల్లో అటువంటి పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. బాలీవుడ్‌ లో జాన్‌ అబ్రహం కధానాయకుడిగా 'రాకీ హ్యాండ్సమ్‌' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను స్వయంగా జాన్‌ అబ్రహం నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం 2010లో విడుదలైన కొరియన్‌ సినిమా 'ద మ్యాన్‌ ఫ్రమ్‌ నో వేర్‌' అనే చిత్రం ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అతిధి పాత్రలో శృతిహాసన్‌ నటించింది. డ్రగ్స్‌ మాఫియా ముఠాకి చెందిన వాళ్ళు ఒక ఎనిమిదేళ్ళ పాపను ఎత్తుకెళతారు.

హీరో ఆ పాపను సురక్షితంగా ఎలా తీసుకువస్తాడో అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో శృతి చేసిన అతిధి పాత్ర గురించి శృతి మాట్లాడుతూ, ఈ సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఆ పాత్రలో నటించాను. పాపను రక్షించడంలో నా పాత్ర ఏంచేసిందో మాటల్లో చెప్పేకంటే తెరపై చూస్తేనే బావుంటుంది అని చెప్పింది. ఈ పాత్రకు నడివి తక్కువగా ఉంటుంది. కానీ ఈ పాత్రకున్న ప్రాధాన్యత వల్ల శృతి నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమా అన్ని పనులనూ పూర్తిచేసి మార్చి 25న విడుదల చెయ్యడానికి సినిమా యూనిట్‌ సన్నాహాలు చేస్తుంది.

English summary

Sexy heroine Shruti Hassan doing guest role in 'Rocky Handsome' bollywood movie. In this movie John Abraham was hero and he is producing the movie. Rocky Handsome is remake of Korean movie 'The Man From No Where'.