కమల్‌ డైరెక్షన్‌లో శృతి!!

Shruti Hassan in Kamal direction

12:41 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Shruti Hassan in Kamal direction

తన నటనతో యావత్‌ భారతదేశాన్నే మంత్రముగ్దుల్ని చేసిన లోకనాయకుడు కమల్‌హాసన్‌. లోకనాయకుడు తాజాగా నటించిన చిత్రం 'చీకటిరాజ్యం'. ఈ చిత్రం ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం తరువాత కమల్‌ మరే సినిమా కి అంగీకరించలేదు. అసలు కమల్ ఏ చిత్రంలో నటించబోతాడని అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో కమల్‌ ఒక సినిమాకి శ్రీకారం చుట్టారు. తన కూతురు శృతిహాసన్‌ తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇది తెలుగు-తమిళంలో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతుంది. ఈ చిత్రం ఘాటింగ్‌ ఏప్రిల్‌ నెలలో ప్రారంభమవుతుంది.

శృతిహాసన్‌ ప్రస్తుతం సింగం -3, ప్రేమమ్‌ చిత్రాల ఘాటింగ్‌ తో బిజీగా ఉంది. ఇవి పూర్తయిపోతే శృతి కమల్‌ తెరకెక్కించబోయే చిత్రం ఘాటింగ్‌ లో పాల్గొంటుంది. ఈ చిత్రంలో కమల్‌ శృతిహాసన్‌ కి తండ్రిలా కూడా నటించబోతున్నారు.

English summary

Universal hero Padmasri Kamal Hassan is directing a new comedy entertainer. In this movie Shruti Hassan is acting as a heroine. And also Kamal is acting as a father for Shruti Hassan.