మాజీ ప్రధాని మనవడితో శృతి

Shruti Hassan Item Song In Jaguar Movie

11:37 AM ON 25th August, 2016 By Mirchi Vilas

Shruti Hassan Item Song In Jaguar Movie

ఈ మధ్య తరచూ వార్తల్లోకి రావడం హీరోయిన్లకు అలవాటైంది. అందుకే ప్రాజెక్టులు పెద్దగా లేకపోయినా ఏదోవిధంగా వార్తల్లోకి శృతిహాసన్ వచ్చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో శభాష్ నాయుడు, ప్రేమమ్ మూవీలు మాత్రమే చేస్తోంది. ఇదిలావుండగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కుమార్ తో డ్యాన్స్ చేయబోతోందట. భారీ బడ్జెట్ తో నిఖిల్-దీప్తి జంటగా తెలుగు, కన్నడలో జాగ్వార్ మూవీ రాబోతోంది.

ఇటీవల రిలీజైన మూవీ టీజర్ సినీ లవర్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఐతే, ఇందులో ఐటెమ్ సాంగ్ కోసం యూనిట్ శృతిహాసన్ ని అప్రోచ్ కావడం, అందుకు ఆమె ఓకే చేయడం కూడా జరిగిపోయిందని సమాచారం. సినిమాకి ఈ సాంగ్ హైలైట్ అవుతుందట. ఇందుకోసం శృతికి బాగానే ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. మహదేవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. అన్నట్టు మాజీ సీఎం కుమారస్వామికి స్వయంగా నిఖిల్ కొడుకే.

ఇవి కూడా చదవండి:ఒకేసారి అమీర్, షారూక్ లకు సుష్మా షాకిచ్చారు

ఇవి కూడా చదవండి:స్టార్ డైరెక్టర్ ఇంటిపై బాంబులతో దాడి?

English summary

Ex Prime Minister of India Deve Gowda's grand son Nikhil was presently acting in a movie called Jaguar in Kannada and Telugu. Recently this movie unit approached Sruthi Hasan for item song in this movie and she accepted to do item song with Nikhil Gowda.