ఆ హీరోతో సీక్రెట్ గా లవ్ ఎఫైర్ సాగిస్తున్న శృతి హాసన్!

Shruti Hassan love affair with Ranbir Kapoor

04:22 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Shruti Hassan love affair with Ranbir Kapoor

యూనివర్సల్ స్టార్, లోక నాయకుడు కమల్ హాసన్ వంటి స్టార్ హీరో ఇమేజ్ నుంచి వారసురాలిగా శృతి హాసన్ సినీ ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసింది. అటువంటి దిగ్గజ తనయురాలిగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఏమాత్రం తడబాటు లేకుండా హొయలు, అందాలు ఆరబోయగలదు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును నటనతో సొంతం చేసుకుంది. హీరోయిన్ గా ప్రతిభ కనబరచడంతో పాటు ఐటెం సాంగ్స్ లో కూడా రెచ్చిపోయి అందాలు ఒలకబోయడం ఈమెలో ఉన్న ప్రత్యేకత. అందుకే కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్.. బాలీవుడ్ లలో కూడా సూపర్ ఫామ్ తో మల్టీ ట్యాలెంట్ తో తన దైన శైలితో దూసుకుపోతుంది ఈ చారుశీల. ఇంతవరకు బాగానే ఉన్న ఈ చెన్నై సుందరిపై తాజాగా సినిమాల సంగతులు కాకుండా..

రియల్ లవ్ స్టోరీ నడిపిస్తోందనే వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ తో శృతి ప్రేమలో పడిందని టాక్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని నెలల కిందట కత్రినా కైఫ్ తో బ్రేకప్ అయిపోయిన రణబీర్ కి శృతి తోడు బాగానే సెట్ అయిందని అంటున్నారు. పైగా ఈ మధ్య చాలా సార్లు నైట్ క్లబ్ లలో ఈ జంట కనిపించిందనే టాక్ కూడా ఉంది. సినిమాల కోసం ముంబై-చెన్నై-హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతుండగా.. ఇప్పుడీ ప్రేమ ప్రయాణాలు మరింత ఎక్కువైపోయాయట కూడా. మొత్తానికి ఈ లవ్ స్టోరీ శృతి హాసన్ ని ఎటు నడిపిస్తుందో, ఎంత దూరం తీసుకెళుతుందో అని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

ఇది కూడా చదవండి: మీ బాయ్ ఫ్రెండ్ వర్జినో కాదో తెలుసుకోండిలా..

ఇది కూడా చదవండి: ఐఫోన్ ఖరీదు 60వేలు.. కానీ నిజంగా దానికయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: మీరు చనిపోయినట్టు కల వస్తే దాని వెనక అర్ధం ఏంటో తెలుసా?

English summary

Shruti Hassan love affair with Ranbir Kapoor. Hot beauty Shruti Hassan love affair with bollywood chocolate boy Ranbir Kapoor.