ఎన్టీఆర్ అంటే నాకు కుళ్ళు: శృతి హాసన్

Shruti Hassan talks about Ntr

11:39 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Shruti Hassan talks about Ntr

కమలహాసన్ వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన శృతి హాసన్ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తన టాలెంట్, అందాల ఆరబోతతో తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రేక్షకుల్ని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను చూస్తే.. తనకు ఎప్పుడూ కుళ్లు పుడుతుంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అది డ్యాన్స్ అయినా ఫైట్స్ అయినా ఎన్టీఆర్ దాన్ని ఇట్టే పట్టేస్తాడు.. సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేసేస్తాడని శృతి హాసన్ తెలిపింది. కానీ తాను అలా కాదని, కెమెరా ముందు నుంచునే ప్రతీసారి తప్పనిసరిగా రిహార్సల్ చేయాల్సిందేనని.. ఇందుకే తనకు ఎన్టీఆర్ అంటే జెలసీ అంటూ నిజాన్ని చెప్పేసింది.

నిజానికి ఎన్టీఆర్ ఆల్ రౌండర్. తనతో మాట్లాడుతుంటే.. ఇతనికి తెలియని విషయాలు ఏమైనా ఉంటాయా అనిపిస్తుంది అంటూ ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చింది శృతి హాసన్. మిగిలిన హీరోల్లో అయితే రవితేజ గురించి ఎక్కుగా చెప్పుకొస్తోంది శృతి హాసన్. కొంతమందితోనే మళ్లీ మళ్లీ చేయాలని అనిపిస్తుందని అలాంటి వాడే రవితేజ అంది శృతి. రవితేజను కాసేపు అబ్జర్వ్ చేస్తే.. తనలో ఎనర్జీ లెవెల్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుస్తుందని శృతి హాసన్ తెలిపింది. 'బలుపు' ఆడియో ఫంక్షన్‌లో డాన్స్ చేయడానికి కారణం.. మాస్ మహారాజ్ ఇచ్చిన ఎనర్జీనే అంటోంది. ట్యాలెంట్ కంటే రవితేజ మంచి మనసున్నోడు అంటూ శృతి హాసన్ సర్టిఫికేట్ ఇచ్చింది.

English summary

Shruti Hassan talks about Ntr. Hot beauty Shruti Hassan told about Ntr. That she feel jealous about Ntr.