ఉమెన్స్‌ డే స్పెషల్‌గా శృతి రెడీ

Shruti Hassan to release special song on Womens Day

11:03 AM ON 4th March, 2016 By Mirchi Vilas

Shruti Hassan to release special song on Womens Day

బాలీవుడ్‌లో శృతి నటించిన ‘రాకీ హ్యాండ్సమ్‌’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది . ఇక జాన్‌ అబ్రహం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నిశికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో ‘ప్రేమమ్‌’లో నటిస్తున్న నటి శృతి హాసన్‌ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఓ కానుక ఇవ్వ బోతోందట..... అది కూడా ఓ పాట రూపంలో ... షూటింగ్‌లతో బిజీగా ఉన్న శృతి ఇలా సమయం కేటాయించి మరీ మహిళల కోసం పాట విడుదల చేయడం గ్రేటే మరి. సంగీత దర్శకులు ఎహ్‌సాన్‌ నూరానీ, లాయ్‌ మెన్‌డోన్కాలతో కలిసి ఆమె ఈ పాటను విడుదల చేయడానికి నిర్ణయించిందట. మహిళలను చైతన్య పరిచే దిశగా ఈ పాటను రచించినట్లు శృతి చెబుతోంది. . స్త్రీలకు కలలు కనే శక్తినిస్తూ... ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా పాట ఉంటుందని తెలిపారు. ఈ పాటలోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని అంటోంది.

English summary