ఐటమ్ గర్ల్ గా మారిన పటాస్ భామ

Shruti Sodhi doing item song in Supreme

05:51 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Shruti Sodhi doing item song in Supreme

తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే విజయం సొంతం చేసుకున్న హీరోయిన్‌ శృతిసోధి. 'పటాస్‌' సినిమాలో కళ్యాణ్‌రామ్‌ తో జతకట్టింది శృతి. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో శృతి తెలుగులో టాప్‌ హీరోయిన్‌ అయిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. హీరోయిన్‌ సినిమా హిట్‌ అయితే క్రేజ్‌ వస్తుంది కానీ శృతి విషయంలో మాత్రం అలా జరగలేదు. శృతికి కొత్త అవకాశాలేమి రాలేదు. ఒకసారి ఆదితో ఒక సినిమాలో ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరిగింది. కానీ తర్వాత అది కూడా అబద్ధమే అని తెలిసింది. దీంతో ఆమె అడ్రస్‌ గల్లంతయ్యింది అని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఈమెకి అవకాశం వచ్చింది.

అయితే హీరోయిన్‌గా కాదు, ఐటెమ్‌సాంగ్‌ చెయ్యడానికి శృతి సిద్దమైపోయిందట. తొలి సినిమాకు అవకాశమిచ్చిన అనిల్‌ రావిపూడే ఐటెమ్‌ సాంగ్‌కి కూడా అవకాశమిచ్చాడు. ప్రస్తుతం అనిల్‌ సాయిధరమ్‌తేజ్‌ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌ గా నటిస్తోంది. ఆ సినిమాలో ఒక ఐటెమ్‌ సాంగ్‌ ఉందట. ఆ పాటలో శృతి అదరగొట్టనుంది. 'పటాస్' లో కూడా శృతి డ్యాన్స్ చాలా బాగా చేసింది, అందుకే ఈ ఐటెమ్‌సాంగ్‌ లో నటించే అవకాశం శృతికి ఇచ్చారట. పటాస్‌ సినిమాలో న్యూస్‌ రిపోర్టర్‌ పాత్రలో నటించిన శృతి ఈ సినిమాలో ఐటెమ్‌ గర్ల్‌గా కనిపించనుంది. మరి ఈ సినిమా తరవాతైనా అవకాశాలు వస్తాయో లేదో.

English summary

Pataas heroine Shruti Sodhi doing item song in Sai Dharam Tej's Supreme movie. This movie is directing by Anil Ravipudi. Rashi Khanna is romancing with Sai Dharam Tej in this movie.