దర్శకుడుతో శ్వేతా డేటింగ్... త్వరలో పెళ్ళి?!

Shweta Basu Prasad love affair with director

12:05 PM ON 19th July, 2016 By Mirchi Vilas

Shweta Basu Prasad love affair with director

బాలనటిగా సినీ పరిశ్రమలో ఎంటరై, ఆపై హీరోయిన్ గా కొత్తబంగారు లోకం వంటి సినిమాల్లో నటించి, ఐటమ్ గర్ల్ గా మారిన శ్వేతాబసు ప్రసాద్ కి కూడా ఓ ఇమేజ్ ఉంది. అయితే, ఐటమ్ గర్ల్ కే పరిమితం కావడంతో, దొరికిన ఛాన్సుల్ని చేసుకుంటూ పోయింది. ఇక ఆ మధ్య సెక్స్ రాకెట్ కేసులో శ్వేత పట్టుబడి, కోర్టు నుంచి క్లీన్ చీట్ తో బయటకొచ్చిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు ముంబై ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఆఫీస్ లో స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా కెరీర్ కొనసాగిస్తుంది. ఇక ఇప్పటివరకు ప్రియుడి మాటెత్తని శ్వేతాబసు వలలో ఇటీవల ఓ యువకుడు పడ్డాడు. దీంతో శ్వేతాబసుకు బాయ్ ఫ్రెండ్ దొరికేశాడు అంటూ ఒకటే కామెంట్స్ వచ్చేస్తున్నాయి.

అంతేకాకుండా ప్రేమలో పడిన వీరు ఫిబ్రవరి నుంచి డేటింగ్ మొదలెట్టారట. ఇంతకీ శ్వేతా బాయ్ ఫ్రెండ్ ఎవరంటే, అనురాగ్ ఆఫీస్ కి ఎక్కువగా వచ్చే చిన్న సినిమాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్ అట. ఇతగాడు ఆటో హెడ్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడట. ఇద్దరి అభిరుచులూ ఒకేవిధంగా ఉండటంతో, ఒకరికొకరు హ్యాపీగా చెట్టాపట్టాలేసుకుని చక్కర్లు కొట్టేస్తున్నారట. త్వరలో శ్వేత-రోహిత్ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అదే జరిగితే సెక్స్ రాకెట్ పేరిట ఎంతో మానసిక ఒత్తిడి గురైన ఆమెకు రిలాక్స్ లభించినట్లేనని కూడా అంటున్నారు. అదే జరిగితే, ఆమెకు నిజంగా కొత్త బంగారు లోకం లభించినట్లవుతుందని సినీ లవర్స్ చెబుతున్నారు.

1/5 Pages

English summary

Shweta Basu Prasad love affair with director