ఓ ఎస్సై డాన్స్ మత్తులో మునిగాడు - అడ్డంగా బుక్కయ్యాడు

SI Booked For Dancing In A Party

10:41 AM ON 9th July, 2016 By Mirchi Vilas

SI Booked For Dancing In A Party

ఈ మధ్య పలు ఘటనల్లో పోలీసులు అడ్డంగా బుక్కవుతున్నారు. ఆదుకోవాలో ఓ ఎస్ ఐ బుక్కై పోయాడు. డే అండ్ నైట్ డ్యూటీ చేసి అలసిపోయిన ఓ ఎస్ఐ, కళ్లముందు కనిపిస్తున్న డ్యాన్స్ పార్టీని బాగా ఎంజాయ్ చేశాడు. ఇందులో తప్పేమీలేదుకానీ, ఆ టైమ్ లో ఇద్దరు యువకులు గాల్లోకి కాల్పులు జరిపినా, సదరు అధికారి స్పందించలేదు. అయితే ఈ తతంగాన్ని పార్టీ నిర్వాహకులు షూట్ చేసి, ఆ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది సదరు ఎస్ఐ యవ్వారం రచ్చకెక్కింది. పరిస్థితి గమనించిన ఉన్నతాధికారులు అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ,

ఉత్తరప్రదేశ్.. రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవంత్ పూర్ లో స్థానికుల రెడీ చేసిన పార్టీకి ఎస్ఐ సీతారాం హాజరయ్యాడు. పార్టీ అనగా యవతీయువకులతో ఏర్పాటు చేసిన డ్యాన్స్ అతిధులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు యువకులు తమవద్దనున్న తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఐతే, ఈ చర్యను అడ్డుకోవాల్సిన ఎస్ఐ సీతారాం, వాటిని పట్టించుకోలేదు సరికదా.. డ్యాన్స్ మత్తులో మునిగాడు. నిర్వాహకులు ఈ పార్టీలో వీడియో షూట్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది. ఎస్ఐ దర్జా చూసి ఉన్నతాధికారులే షాకయ్యారు. వెంటనే రంగంలోకి పైస్థాయి అధికారులు కాల్పులతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ల నుంచి గన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ సీతారాంను సస్పెండ్ చేశారు. అదండీ సంగతి.

ఇవి కూడా చదవండి:సెల్ఫీ బానే వచ్చింది.. కానీ మనిషే అదృశ్యం(వీడియో)

ఇవి కూడా చదవండి:బికినీ వేసుకుని కిటికీలో సన్ బాత్

English summary

A Sub Inspecter named Sitaram who was working in Rampur in Uttarpradesh was booked for dancing in a party and he was not stopped the gun fire made by two men also and the video of this was going viral over the internet.