చంద్రకళ -2 లో సిద్ధార్ధ్‌, త్రిష!!

Siddharth and Trisha in Chandrakala 2 movie

07:20 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Siddharth and Trisha in Chandrakala 2 movie

హన్సిక లీడ్‌ రోల్ లో నటించిన హర్రర్‌ కామెడీ 'ఆరన్‌మనై' (తెలుగులో చంద్రకళ')కు సీక్వెల్‌ గా రూపొందుతుంది. ఇందులో సిద్ధార్ధ్‌, త్రిష, హన్సిక నటిస్తున్నారు. దీనికి 'ఆరన్‌మనై-2' (చంద్రకళ-2) పేరుతో ఈ చిత్రాన్ని రూపొందుతున్నారు. యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రాల తరువాత సిద్ధార్ధ్‌, త్రిష మళ్లీ జంటగా ఇన్నెళ్లకి నటిస్తున్నారు. సుందర్‌ .సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి భాగానికి తెలుగులో మంచి రెస్పాన్స్‌ రావడంతో రెండో భాగాన్ని కూడా తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఘాటింగ్‌ మొత్తం ఇవాల్టితో పూర్తయింది.

సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో ఈ చిత్రం తమిళం, తెలుగు బాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రంలో ఒకపాట కోసం 103 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘాట్‌ చేసారు. ఈ పాటే ఈ చిత్రంలో ప్రత్యేకత అని చెప్పవచ్చు.

English summary

Siddharth and Trisha in Chandrakala 2 movie. In part 1 Hansika acted in lead role. After the success of part 1 now Sundar.C is directing sequeal for it.