సిద్ధార్ధ్‌ 'జిల్‌ జంగ్‌ జుక్‌' వాయిదా!

Siddharth Jil Jung Juk has been postponed

11:46 AM ON 17th December, 2015 By Mirchi Vilas

Siddharth Jil Jung Juk has been postponed

హీరో సిద్ధార్ధ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'జిల్‌జంగ్‌ జుక్‌'. ధీరజ్‌ వైడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల చెయ్యాలనుకున్నారు. అయితే చెన్నై లో సంభవించిన వరదలు వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకి హీరో సిద్ధార్ధ్‌ వాళ్లకి ఎంతో సహాయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కోలుకోని కొన్ని గ్రామల ప్రజలకి సిద్ధార్ధ్‌ వారికి కావాల్సిన సదుపాయాలని అడిగి మరి తెలుసుకుంటున్నాడు. పూర్తిగా సహాయ కార్యక్రమాల పనుల్లో నిమగ్నమైన సిద్ధార్ధ్‌ 'జిల్‌జంగ్‌జుక్‌' విడుదలకు హాజరు కాలేకపోవడంతో ఈ చిత్రం విడుదలని వాయిదా వేశారు.

ఈ చిత్రాన్ని న్యూఇయర్‌ కానుకగా జనవరి 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. నీలి రంగు జుట్టుతో కనిపిస్తున్న సిద్ధార్ధ్‌ ఈ చిత్రాన్ని 'జిల్‌జంగ్‌జుక్‌' చిత్రాన్ని తనే స్వయంగా నిర్మించాడు.

English summary

Siddharth Jil Jung Juk has been postponed due to Chennai floods.