ఛ ఛ... ఆలయంలోనే ఏఈవో రాసలీలలు

Siddipet Mallanna Temple AEO Caught Red Handedly

10:58 AM ON 15th December, 2016 By Mirchi Vilas

Siddipet Mallanna Temple AEO Caught Red Handedly

ప్రశాంతతకోసమే చాలామంది కాసేపు ఆలయాలకు వస్తుంటారు. కానీ అక్కడ జుగుప్స కలిగించే కార్యకలాపాలు సాగితే ఏమనాలి? అవును, ఆధ్యాత్మి కతకు నిలువెత్తు నిదర్శ నంగా నిలిచే సిద్ధిపేట ప్రాంతంలోని కొమురెల్లి మల్లన్న ఆలయంలో ఏఈవో వైరాగ్యం అంజయ్య అనైతిక కార్యక లాపాలకు పాల్పడుతున్నాడు. ఏకంగా గుడి ఆవరణలోనే రాసలీలలకు తెర తీసాడు. ఆలయ బుకింగ్ కార్యాలయం సమీపంలోనే ముద్దు ముచ్చట్ల కు దిగాడు. పొట్టకూటికి పాకులాడుతున్న కొంతమందిని ‘మాయ’ చేసి లోబరుచుకుంటున్నట్లు కూడా ఈఓ విషయంలో ప్రచారం ఉంది. తనతో కామ క్రీడలకు అంగీకరించిన వారి బంధువులు, కుటుంబ సభ్యులకు ఆలయంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు సమ్మతించిన వారిని అర్హత లేకున్నా అందలమెక్కించడంలో, సహకరించని వారిని అర్హతలున్నా అథః పాతాళానికి తొక్కేయడంలో ఆయనకు ఆయనే సాటి అనే ఆరోపణలు ఉన్నాయి.

రాసలీలలతో అంజయ్య ఆలయ పవిత్రతను భ్రష్టుపట్టిస్తున్నాడని పేర్కొంటూ గతంలో గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఆలయ గెస్ట్ హౌజ్ లలో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ఈ విషయం అప్పట్లో కలకలం రేపింది. అయినా అంజయ్యలో మార్పు లేదు. లక్షలాదిమంది భక్తుల మనోభావాలకు ప్రతీక అయిన మల్లన్న ఆలయ భవితవ్యం దృష్ట్యా ఏఈవో అవకతవకలపై ఎప్పటికప్పుడు అక్షర అస్ర్తాన్ని సంధిస్తున్న నేపథ్యంలో అంజయ్య రాసలీలలకు సంబంధించిన ఫొటోలను ఓ పత్రికకు అతి రహస్యంగా అందించారు. వాటిలో కొన్ని ఆలయ బుకింగ్ కార్యాలయం, గెస్ట్ హౌజ్ వెనక భాగంలో దిగినవి కాగా, మరికొన్ని వాహనం, గదుల్లో సాగించిన లీలలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీనిపై ఎండోమెంట్స్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తగుచర్యలు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ఆ పాటకు చిందులేస్తూ, నోట్ల వర్షం కురిపిస్తూ... బీజేపీ నేత ఏం చేశాడో తెలుసా?

ఇవి కూడా చదవండి: షాకింగ్ న్యూస్: అమ్మకు మరోసారి అంత్యక్రియలు!

English summary

Siddipeta Mallanna Swamy Temple was very famous and the AEO of the Temple Anjayya was caught red handedly to media and the photos of he enjoying with ladies was came out. Officials were getting ready to take certain actions on him.