థైరాయిడ్ ఉత్పత్తి తక్కువ ఉందని చెప్పటానికి సంకేతాలు

Signs that You Have an Underactive Thyroid

03:23 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Signs that You Have an Underactive Thyroid

థైరాయిడ్ తక్కువ ఉంటే హైపోథైరాయిడిజం అని పిలుస్తారు. థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ అనే హార్మోన్ ని అవసరమైనంత ఉత్పత్తి చేయలేకపోవుట వలన ఈ సమస్య వస్తుంది. ఈ హార్మోన్ శరీరంలో శక్తిని ఉపయోగించటం, ఆహారంను జీర్ణం చేయటం,శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం వంటి ప్రధాన విధుల నిర్వహణలో సహాయపడుతుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు తక్కువ స్థాయిలో ఉత్పత్తి అయితే ఈ విధులకు ఆటంకం ఏర్పడుతుంది. థైరాయిడ్ సమస్యను రక్త పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఇప్పుడు థైరాయిడ్ సమస్య ఉందని చెప్పే సంకేతాలను తెలుసుకుందాం.

1/11 Pages

1. అకారణంగా బరువు పెరుగుట

ఆహారం లేదా వ్యాయామాలలో ఎటువంటి మార్పు లేకుండా బరువు పెరిగితే థైరాయిడ్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉందని అర్ధం. ఈ హార్మోన్ జీవక్రియ మరియు కొవ్వు, గ్లూకోజ్ జీవక్రియను  నియంత్రించటానికి సహాయపడుతుంది.  థైరాయిడ్ ఉత్పత్తి తగ్గటం వలన జీవక్రియ రేటు తగ్గి అదనపు బరువు పెరగటానికి దోహదపడుతుంది. అకారణంగా బరువు పెరిగితే మాత్రం అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి.

English summary

In this article, we have listed about Symptoms that You Have an Underactive Thyroid. Thyroid problems are easily identified with a simple blood test and can often be fixed with the right medicines.