2016 సైమా విజేతలు వీరే..

SIIMA Awards 2016 Winners List

12:37 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

SIIMA Awards 2016 Winners List

ఇప్పటికే బాహుబలి , శ్రీమంతుడు పోటాపోటీగా పలు అవార్డులు పొందగా, ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకే వేదికగా జరుపుకునే సైమా అవార్డ్స్ 2015-16 వేడుక లోనూ హవా చూపించాయి. సైమా అవార్డుల వేడుక సింగపూర్ లో అట్టహాసంగా జరుగుతోంది. గురువారం ప్రారంభమైన ఈ వేడుకకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్రప్రసాద్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, అల్లు శిరీష్, అఖిల్, సాయికుమార్, రానా, వరుణ్ తేజ్, సుశాంత్, అలీ, రాధిక, సుహాసిని, హన్సిక, నిత్యామీనన్, శృతిహాసన్, కుష్బు, లక్షీ మంచు, నయనతార, ప్రణిత, సాయేషా సైగల్ తో పాటు ప్రముఖ గాయని పి.సుశీల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో పురస్కారాల ప్రదానోత్సవంతో పాటు, హీరోయిన్ల పర్ ఫార్మెన్స్ లతో ఆడియెన్స్ ను అలరించారు. సైమా అవార్డ్స్ వేడుకలో తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచంద్రన్, రకుల్ ప్రీత్ సింగ్, సుధీర్ బాబు, హ్యుమా ఖురేషీ, ఉషా ఉతప్, తదితరులు స్టేజ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

టాలీవుడ్ నుంచి అవార్డులు గెలుచుకున్న వారి జాబితాను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా బాహుబలికి అవార్డ్ దక్కగా, ఉత్తమ నటుడిగా మహేష్ బాబు ఎంపికయ్యాడు. గురువారం జరిగిన వేడుకలో తెలుగు, కన్నడ భాషలకు చెందిన నటీనటులకు అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయా విభాగాల్లో గెలుచుకున్న అవార్డులు ఇలా వున్నాయి.

1/25 Pages

1.ఉత్తమ చిత్రం : బాహుబలి

English summary

SIIMA Awards 2016 function was grandly done in Singapore and Bahubali and Srimanthudu movies were won most of the awards this year awards function.