చిక్కులు తెచ్చిన సరదా..

Sikh boy jokes about bomb in School

07:09 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Sikh boy jokes about bomb in School

నాన్నా పులి సామెత మనందరికీ తెలిసిందే.. ఇదే రీతిలో ఓ బాలుడు సరదా కోసం మిత్రులతో అన్న మాట అతన్ని ఊచలు లెక్కించేలా చేసింది. అమెరికాలోని డల్లాస్‌ నికోల్స్‌ జూనియర్‌ హైస్కూల్‌లో చదువుతున్న 12 ఏళ్ల అర్మాన్‌ సింగ్‌ సరాయ్‌ ఓరోజు స్నేహితులను ఆటపట్టించడానికి తన బ్యాగులో బాంబు ఉందని చెప్పాడు. ఇది విన్న తోటి విద్యార్థి అర్మాన్‌ని ఏడిపించాలని.. అర్మాన్‌ దగ్గర బాంబు ఉందని, స్కూల్‌ను పేల్చేయాలని చూస్తున్నాడని టీచర్‌కి చెప్పాడు. ఆమె విషయం స్కూల్‌ యాజమాన్యానికి చెప్పడంతో వారు ఆగమేఘాలమీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని బ్యాగు వెదకడం, ప్రశ్నించడం లాంటివేమీ చేయకుండానే నేరుగా పోలీసులకు అప్పగించేశారు. వారు అర్మాన్‌ని తిన్నగా స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించి మూడు రోజుల పాటు బాలనేరస్థుల గృహంలో కూర్చోబెట్టారు. అర్మాన్‌ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూలుకు, పోలీసుస్టేషన్లకు తిరిగి విషయం తెలుసుకున్నారు. తమ నేపథ్యం గురించి పూర్తి వివరణలు ఇచ్చుకున్నాక కానీ అధికారులు అర్మాన్‌ను వదిలిపెట్టలేదు. ఈ విషయాన్ని అర్మాన్‌ కజిన్‌ ఫేస్‌బుక్‌లో పెట్టడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

English summary

A 12-year-old Sikh boy was jailed for three days for joking to a classmate that he has a bomb in his bag and said he was going to blast the school