సిల్క్ స్మిత ఈ లోకానికి దూరమై ఇప్పటికి 2 దశాబ్ధాలు!

Silk Smitha death anniversary

12:25 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Silk Smitha death anniversary

ఐటెం సాంగ్స్ లో జ్యోతిలక్ష్మి, జయమాలిని తర్వాత అంతటి పాపులర్ పేరు తెచ్చుకుని భారతీయ సినిమాలో ఆమె పెను సంచలనంగా మారింది. గ్లామర్ కు చిరునామా అయింది. దక్షిణాది ప్రేక్షకుల్ని తన చూపులతో కవ్వించి, నటనతో ఉర్రూతలూగించిన ఆ అందాలతారే సిల్క్ స్మిత. ఆంధ్రాలోని ఏలూరుకు చెందిన విజయలక్ష్మి 1979లో వండిచక్రం తమిళ చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టి సిల్క్ స్మితగా మారింది. 1980-90ల్లో వెండితెరను ఓ ఊపు ఊపేసింది. అయితే 1996, సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. సిల్క్ దూరమై శుక్రవారంతో రెండు దశాబ్ధాలు పూర్తయ్యింది.

అయినా ఇప్పటికీ ఆమె రూపు తమ గుండెల్లో నుంచి చెరిగిపోలేదని అభిమానులు చాటుకుంటున్నారు. సిల్క్ ని తలచుకుంటూ గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఆమె అభిమానులు అంజలి ఘటిస్తూనే వున్నారు. కొంతమంది అభిమానులు అయితే ప్రత్యేకంగా పోస్టర్లు వేసి నివాళులర్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి: గడపపై కూర్చోకూడదని ఎందుకు అంటారో తెలుసా?

ఇది కూడా చదవండి: ఐఫోన్ ఖరీదు 60వేలు.. కానీ నిజంగా దానికయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: మీ బాయ్ ఫ్రెండ్ వర్జినో కాదో తెలుసుకోండిలా..

English summary

Silk Smitha death anniversary. Hot item songs dancer and hot heroine Silk Smitha was gets suicide in 1996.