అరేంజ్డ్ మ్యారేజ్‌ బెటరంటున్న శింబు!!

Simbu is ready for arranged marriage

12:12 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Simbu is ready for arranged marriage

ఎప్పుడూ వివాదాలతో బిజీగా ఉండే తమిళ హీరో శింబు ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నాడు. తను ప్రేమ వివాహం చేసుకుంటానని చాలా ఇంటర్‌వ్యూ లలో శింబు చెప్పాడు. అయితే ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి ఒప్పుకోవడంతో అందరూ చాలా ఆశ్చర్య పడుతున్నారు. కుటుంబ సభ్యులు ఒత్తిడి మరియు తాజాగా వచ్చిన బీప్‌సాంగ్‌ వివాదాల కారణంగా శింబు పెళ్ళికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. శింబు తండ్రి టి. రాజేందర్‌, శింబు పెళ్ళికి ఒప్పుకున్నాడనీ, మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నారనీ స్పష్టం చేశాడు. అయితే ఇది వరకు శింబుకి, నయనతార-హన్సిక లతో లింక్‌ ఉండటం తరువాత విడిపోవడం కూడా శింబు పెళ్ళి నిర్ణయానికి ప్రధాన కారణాలు.

మరోపక్క శింబు తన పెళ్ళి ప్రస్థావన ద్వారా బీప్‌సాంగ్‌ వివాదం నుంచి జనాలను దారి మళ్ళించాలని అనుకుంటున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

English summary

Simbu is ready for arranged marriage. Simbu's father T. Rajendar was confirmed about his son's marriage. We are searching for goood life partner for Simbu.