‘బీప్‌’సాంగ్‌ కేసులో లొంగిపోయిన శింబు

Simbu surrenders in Police station

10:27 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

Simbu surrenders in Police station

‘బీప్‌’సాంగ్‌ కేసుకు సంబంధించి నటుడు శింబు సోమవారం కోయంబత్తూర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మహిళలను కించపరిచే విధంగా శింబు పాడినపాట గత నెల వెబ్‌సైట్‌లో హల్‌చల్‌ చేసింది. దీంతో కోయంబత్తూర్‌ జిల్లా రేస్‌కోర్స్‌ పోలీసులు, చెన్నై సెంట్రల్‌ క్రైం విభాగం పోలీ సులు వేర్వేరుగా శింబుపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 24వ తేదీలోపు కోయంబత్తూర్‌ కోర్టులో హాజరు కావాలని మద్రాసు హైకోర్టు నటుడు శింబుకు నోటీసు జారీ చేసిన నేపధ్యంలో తండ్రి రాజేందర్‌తో కలిసి శింబు పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో శింబు ఫ్యాన్స్ 500 మంది పోలీస్ స్టేషన్‌ దగ్గర హడావుడి చేశారు. పోలీసులు 20 నిమిషాలు పాటు శింబుని విచారించారు. వారు అడిగిన ప్రశ్నలకు శింబు సమధానాలు ఇచ్చాడు. తనేమీ తప్పు చేయలేదని, అంతా దేవుడిపై భారం వేశానని తన వాదన వినిపించాడు. గతంలో శింబుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా ఈ కేసులో ఉన్న సంగీత దర్శకుడు అనిరుధ్ ఇప్పటికే పోలీసుల ఎదుట తన వాదన వినిపించాడు.

English summary

Tamil Hero Simbu appear in Kovai Police Station Simbu.Surrender in Police Station Over Beep song Controversy.