పోలీసులకు లొంగిపోనున్న శింబు

Simbu To Surrender To Police

03:17 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Simbu To Surrender To Police

ప్రముఖ కోలీవుడ్‌ హీరో శింబు, మ్యూజిక్‌ డైరక్టర్‌ అనిరుధ్‌ లు కలసి ఇటీవల పాడిన 'బీప్‌సాంగ్‌' వారిని చిక్కుల్లోకి నెట్టింది. మహిళలను అసభ్యపదజాలంతో అగౌరవపరిచేలా ఉన్న ఈ పాటపై మహిళ సంఘాలు, అనేక మంది ఆందోళన చేసారు. ఆ పాట పై ఇప్పటికే మహిళ సంఘం అధ్యక్షురాలు రాధిక కోయంబత్తూరు పోలీస్‌ స్టేషల్లో కేసు పెట్టింది.

శింబు, అనిరుధ్‌ల పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వారి చిత్రపటాలను దిష్టిబోమ్మలను తగలపెట్టారు. మహిళలను అగౌరవ పరిచేలా ఉన్నందున వారిని కఠినంగా శిక్షించాలంటూ మహిళ సంఘాలు అనేక కేసులు పెట్టారు.

ఇది ఇలా ఉండగా పోలీస్ కేసు నమోదు అయ్యిన దగ్గర నుండి హీరో శింబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మ్యూజిక్‌ డైరక్టర్‌ అనిరుధ్‌ కెనడాలో ఉన్నాడు. అయితే అనిరుధ్‌ కెనడాలో లేడని చెన్నైలోనే ఉన్నాడని కొందరు వాదిస్తున్నారు. వీరిద్దరి పై కోయంబత్తూరు లో నమోదైన కేసు కారణంగా శింబు ను ఈ నెల 19న పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ఈ విషయం పై శింబు తానంతటతానే పోలీసుల ఎదుట లొంగిపోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

English summary

Tamil hero simbu and young music director anirudh together made a "Beep Song" .That song was opposed by many people and police cases were Also filed against them. Because of this simbhu was thinking that he wants to surrender himself in the police station